WORDPRESS PLUGIN : IN TELUGU

WORDPRESS PLUGIN : IN TELUGU 

ఈ బ్లాగ్ లో మీకు WordPressలో వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మరియు దానిని ఆకర్శనీయంగా తీర్చిదిద్దడానికి అవసరమయిన ముఖ్యమయిన ప్లగిన్స్ గురించి WORDPRESS PLUGIN : IN TELUGU అనే ఈ Article లో వివరిస్తాను.

అదే విధంగా ఈ WordPress Plugin ని డౌన్ లోడ్ చేసుకొని వీటిలో సెట్టింగ్స్ చేసే విధానము మీకు వివరిస్తాను.

అంతే కాకుండా ఈ  WordPress Plugins లో గల 8 Useful Plugins యొక్క ఉపయోగాల గురించి వివరిస్తాను.




WordPress Plugin : No.1 –  Editor Plugins  

i) Classic editor

ఈ WordPress Plugin అవసరం ఏంటో మొదలు మనం తెలుసుకుందాం. 

మనము కంప్యుటర్ లో ఒక లెటర్ టైప్ చేయాలంటే MS Word ఎలా అవసరం కదా..!

అదే విధముగా వర్డ్ ప్రెస్ లో మీ వెబ్ సైట్ క్రియేట్ చేయడానికి మరియు దానిలో మార్పులు, చేర్పులు చేయడానికొరకు ఒక “ఏడిటర్ ప్లగ్ ఇన్” అవసరము. 

వివిధ రకాల ఎడిటర్ ప్లగ్ ఇన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి.

కాని అన్ని ఎడిటర్ ప్లగ్ ఇన్స్ లలో నేను ప్రిఫర్ చేసేది “క్లాసిక్ ఎడిటర్”.

ఇప్పుడు వస్తున్న చాలా వరకు WordPress Theme లలో Classic Editor Plugin  ఇన్స్టాల్ కాబడి వస్తుంది.

ఒక వేళ మీరు ఉపయోగించే థీం లో Classic Editor Plugin లేనట్టయితే దానిని వర్డ్ ప్రెస్ డ్యాష్ బోర్డ్ లో గల Add Plugin లో సెర్చ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

లేదా wordpress.org సైట్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకున్న తరువాత Add Plugin లో Upload Plugin బటన్ ద్వారా కూడా అప్ లోడ్ చేసుకోవచ్చు.

Wordpress-Plugin-in-Telugu--Classic Editor

ఎదేని ప్లగ్ ఇన్ ని మీ వెబ్ సైట్ డ్యాష్ బోర్డ్ లోకి ఎలా అప్ లోడ్ చేయాలో నా గత బ్లాగ్ లో చూయించడం జరిగింది.

మీరు How to install WordPress Plugin?  ని క్లిక్ చేసి ప్లగ్ ఇన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకునవచ్చు.

ii) Tiny MCE Advanced

పైన చెప్పిన Classic Editor  మెనూ బార్ లో మనకు కావలసిన బటన్స్ ని చాల సునాయసంగా అప్ డేట్ చేసుకోనడానికి సహాయ పడే WordPress Plugin – టైనీMCE Advanced.

TinyMCE Advanced Plugin ఇన్స్టాల్ చేసి Editing లో అడ్వాన్స్ ఆప్షన్ లను పొందవచ్చు.

పైన పేర్కొన బడిన విధానంతో TinyMCE Editor ప్లగ్ ఇన్ కూడా ఇన్స్టాల్ చేసి Activate చేసుకునండి.

తరువాత, ప్లగ్ ఇన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్లగ్ ఇన్ మెనూ బార్ ని మీకు కావలసిన విధముగా సెట్ చేసుకోవచ్చు.

ఉదాహారణకు క్లాసిక్ ఏడిటర్ మెనూ బార్ లో మీకు justification, underline బటన్స్ అవసరం అయితే దాన్ని మనము ఎలా పెట్ట వచ్చో ఇప్పుడు చూద్దాం.

మీ వర్డ్ ప్రెస్ డ్యాష్ బోర్డ్ లో గల Settings Tab ని క్లిక్ చేస్తే Tiny MCE Advanced అన్న బటన్ కనిపిస్తుంది. దీన్ని ప్రెస్ చేస్తే క్లాసిక్ ఎడిటర్ ఏడిట్ పేజి ఒపెన్ అవుతుంది.

Wordpress-Plugin-in-Telugu-Classic Editor

ఎడిటర్ సెట్టింగ్స్ పేజి ఓపెన్ అయిన తరువాత అందులో Classic Editor (TinyMCE) అనే బటన్ పైన క్లిక్ చేయాలి.

Wordpress-Plugin-in-Telugu-Classic Editor

Classic Editor Settings పేజిలో పై భాగం లొ ప్రస్తుతము Classic Menu Bar లో ఆల్రెడి ఉన్నబటన్స్ కనిపిస్తాయి. 

క్రింది భాగంలో చూస్తే Unused Buttons కనిపిస్తాయి. 

ఇప్పుడు చాల సింపుల్ గా మీకు Classic Menu Bar అవసరము ఉన్న బటన్స్ ని Unused Buttons నుండి Drag చేసి పైకి తీసుకువచ్చి మెను బార్ లో మీకు కావలసిన చోట పెట్టుకోవచ్చు.

useful-plugins-Classic Editor-TinyMCE-Editor-in-Telugu

క్రింద ఇమేజ్ లో చూయించినట్టు మీకు కావలసిన బటన్స్ Classic Editor (TinyMCE) మెనూ బార్ లో కనిపిస్తాయి. 

ఇప్పుడు పైన కుడివైపు గల “Save Changes” బటన్ క్లిక్ చేయండి. 

మీకు రెగ్యులర్ గా అవసరమయ్యే మెనూ బార్ బటన్స్ తో చాలా చక్కగా వెబ్ సైట్ ని ఎడిట్ చేసుకోవచ్చు.




useful-plugins-Classic Editor

WordPress Plugin : No.2 – Insert Header and Footer Plugin

ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫూటర్ : WordPress Plugin లలో ముఖ్యమయిన ప్లగ్ ఇన్ WPbeginers ప్రొవైడ్ చేసిన “Insert Header and Footer”.

సాదారణంగా Google Adsense, Google Search Console, Push Engage మరియు Affiliate Marketing వాళ్లు ఇచ్చే కోడ్ లని మీరు మీ వెబ్ సైట్ “Header” లో, “Body” లో మరియు  “Footer” లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. 

“Insert Header and Footer” ప్లగ్ ఇన్ ద్వారా మీరు ఇటువంటి స్క్రిప్ట్స్ లని గాని కోడ్ లని గాని మీ వెబ్ సైట్ “Header” లో, “Body” లో మరియు  “Footer” లో ఇన్సర్ట్ చేయవచ్చు.

ఈ ప్లగ్ ఇన్ ఎలా సెట్ చేసుకోవాలి మరియు దీని సహాయం తో స్క్రిప్ట్స్ లని గాని కోడ్ లని గాని మీ వెబ్ సైట్ “Header” లో, “Body” లో మరియు  “Footer” లో ఎలా insert చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.

“Insert Header and Footer” వర్డ్ ప్రెస్ డ్యాష్ బోర్డ్ లో గల Add Plugin లో సెర్చ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

లేదా wordpress.org సైట్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకున్న తరువాత Add Plugin లో Upload Plugin బటన్ ద్వారా కూడా అప్ లోడ్ చేసుకోవచ్చు.

తరువాత స్క్రీన్ లో వచ్చే “Insert Header and Footer” ప్లగ్ ఇన్ ని ఇన్స్టాల్ చేసుకుని Activate చేయండి.

Important-Plugins-Wordpress-Insert-Header-and-footer

ఈ ప్లగ్ ఇన్ మీరు ఇన్స్టాల్ చేసుకుని ఆక్టివేట్ చేసుకున్న తరువాత Insert Header and Footer ట్యాబ్ మీకు వర్డ్ ప్రేస్ డ్యాష్ బోర్డ్ లో Settings లొ కనిపిస్తుంది.

ఈ ట్యాబ్ ని క్లిక్ చేయగానే క్రింద ఇమేజ్ లో చూయించినట్టు “Scripts in Header”, “Scripts in Body” మరియు “Scripts in Footer” అనే (3) సెక్షన్స్ కనిపిస్తాయి.

ఇప్పుడు మీకు కావలసిన సెక్షన్ లో మీరు స్క్రిప్ట్ ని గాని కోడ్ ని గాని పేస్ట్ చేసి క్రింద “Save” బటన్ ని క్లిక్ చేయండి.




Important-Plugins-Wordpress-Insert-Header-and-footer

WordPress Plugin : No.03 – Really Simple Plugin 

రియల్లి సింపుల్ యస్.యస్.ఎల్. : WordPress Plugin లలో  అతి ముఖ్యమయిన ప్లగ్ ఇన్ Really Simple Plugins ప్రొవైడ్ చేసిన “Really Simple SSL Plugin”.

అయితే మొదలు దీని ఉపయోగము ఏంటి అనేది మనం  తెలుసుకుందాం.

సాధారణంగా Google Search Engine లాంటి ఏదైనా Search Engine ఒక వెబ్ సైట్ కి ర్యాంక్ ఇవ్వడం కొరకు నిరంతరం Crawl చేస్తునే ఉంటాయి.

అందులో భాగంగా ఒక వెబ్ సైట్ కి మంచి ర్యాంక్ ఇవ్వడానికి Search Engineలు వేరిఫై చేసే అంశాలలో అతి ముఖ్యమైనది సదరు వెబ్ సైట్ “సెక్యూర్డ్ వెబ్ సైటేనా” కాదా అని.

ఒక వెబ్ సైట్ Secured Websites అవునా కాదా అని తెలుసుకునడానికి మీరు క్రింది ఇమేజ్ లో చూయించినట్టుగా Website Url ప్రక్కన క్లిక్ చేసి చూడండి.

useful-plugins-check-website-secured-or-not

పై ఇమేజ్ లో ఉన్నట్టు “Connection is secure” అని ఉంటే సెర్చ్ ఇంజన్ ర్యాంకింగ్స్ లో మంచి ర్యాంక్ వచ్చే అవకాశము ఉంటుంది.

useful-plugins-check-website-secured-or-not

ఒకవేళ పై ఇమేజిలో ఉన్నట్టు “Your connection to this site is not secure” అని ఉంటే Search Engineలలో మంచిర్యాంక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీ వెబ్ సైట్ కి SSL Certificate ఉంటే మరియు మీ వెబ్ సైట్ లో ఈ SSL Certificate రిజిస్టర్ అయి ఉంటే అది సెక్యుర్డ్ వెబ్ సైట్ గా కనపడుతుంది.

సాధారణంగా ఈ SSL Certificate ని వెబ్ హోస్టింగ్ ఖరీదు చేసేటప్పుడు దానితో బాటు ఖరీదు చేయాల్సి ఉంటుంది.

కాని నేను ప్రిఫర్ చేసే Web-Hosting Platform “Hostgator” లొ ఖరీదు చేస్తే Hostgator కంపెని వాళ్లు ఉచితంగా SSL Certificate ని ప్రొవైడ్ చేస్తారు.

useful-plugins-SSL-Hostgator

 

How to Activate Run AutoSSL:

మీ Websiteకి SSL Certificate తీసుకున్న తరువాత, మీ Website Control Panelలో మీ Websiteకి Run AutoSSL activate అయిఉందా లేదా ఒకసారి చూడాలి. 

అందుకొరకు మీరు మీ వెబ్సైట్ Cpanel ని ఓపెన్ చేయాలి.

Cpanel డైరెక్ట్ గా ఓపెన్ చేయడానికి URL అడ్రస్ బార్ లో మీ వెబ్ సైట్ పేరు/Cpanel అని టైప్ చేయాలి. Example : Yoursitename.com/cpanel.

Cpanel User Name మరియు Password మీరు వెబ్ హోస్టింగ్ తీసుకున్నప్పుడు Hosting కంపెనీ వాళ్లు మీకు మేయిల్ చేస్తారు.

Cpanel ఒపెన్ అయిన తరువాత క్రింద ఇమేజ్ లో చూపినట్లు Security Menu లో కనిపిస్తున్న SSL/TLS STatus బటన్ ని క్లిక్ చేయాలి.

cpanel-settings-in-Telugu

ఇప్పుడు కనిపించే స్క్రీన్ లో మనకు కావలసిన డొమైన్ ముందర చెక్ బాక్స్ ని ట్రిక్ చేసి, పైన కుడి వైపున కనుపిస్తున్న “Run AutoSSL” బటన్ ని క్లిక్ చేయాలి.

ఇది Activate కావడనికి 5 నుండి 10 నిముషముల సమయం పట్ట వచ్చు.

 

Wordpress-Plugin-in-Telugu-cpanel-settings-in-Telugu-SSL/TLS-Status

ఆ తరువాత మీ WordPress డ్యాష్ బోర్డ్ లో Install New Plugins లోకి వెళ్లి Really Simple SSL ప్లగ్ ఇన్ ని install చేసుకుని Activate చేయండి.

Wordpress-Plugin-in-Telugu-Really-simple-SSL

తరువాత వచ్చే స్క్రీన్ లో “Go ahead, Activate SSL” ని క్లిక్ చేయండి.

Wordpress-Plugin-in-Telugu-Really-simple-SSL

క్రింది ఇమేజ్ లో కనిపిచ్చినట్టుగా “SSL is enabled on your site” అని వస్తుంది. Configuration ట్యాబ్ పక్కన గల Settings లో మీకు కావలసిన Settings చేసుకోవచ్చు.




Wordpress-Plugin-in-Telugu-Really-simple-SSL-Plugin

WordPress Plugin : No.04 – Easy Table of Contents Plugin 

ఈజి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ : WordPress Plugin లలో  “Easy Table of Contents” మీ వెబ్ సైట్ అందంగా కనిపించడానికి మరియు మీరు రాసిన బ్లాగ్ లో Important Points అన్నిటిని ఒక దగ్గర చూయించడానికి పనికి వస్తుంది.

Easy-Table-of-Contents-Plugin

ఈ ప్లగ్ ఇన్ కొరకు Add New Plugin ని క్లిక్ చేసి Search bar లో Easy Table of Contents ఎంచుకొని ఈ ప్లగ్ ఇన్ ని Install చేసుకుని Activate చేసుకుంటే మీ వెబ్ సైట్ కంటెంట్ లో గల అన్ని Headings ని మీ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో చూడగలుగుతారు.




Wordpress-Plugin-in-Telugu-Yoast-SEO-Plugin

WordPress Plugin : No.05 – Yoast SEO Plugin 

యోస్ట్ యస్.సి.ఒ. : WordPress Plugin : in Telugu లో అన్నిటికంటే ముఖ్యమయినది WordPress Plugins Yoast SEO.

సాధారణంగా Search Engine (Google,Bing,Yahoo etc.,) లలో వచ్చే ఫలితాలని బట్టి మీ Websiteకి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. 

ఈ Search Engineలు అన్ని వెబ్ సైట్లను నిరంతరం Crawl చేస్తునే ఉంటాయి. 

సెర్చ్ ఇంజన్ లలో మెరుగయిన ఫలితాలను తీసుకువచ్చి మీ వెబ్ సైట్ కి మంచి ర్యాంక్ వచ్చేటట్టు చేసే ప్రక్రియనే Search Engineer Optimization అంటారు.

మీ వెబ్ సైట్ కి మంచి ర్యాంక్ పొందడానికి Yoast SEO Plugin సహాయ పడుతుంది. 

Digital Marketing ద్వారా డబ్బు సంపాదించాలనుకునే వారు, వారి వెబ్ సైట్ కి మంచి ర్యాంకుని తెచ్చుకునడానికి ఖచ్చితంగా Yoast SEO Plugin ని install చేసుకునవలసి ఉంటుంది.

ఈ Yoast SEO ప్లగ్ ఇన్ చాలా ముఖ్యమయినదయినందువలన, ఈ Plugin గురించి WordPress Plugin : in Telugu ఆర్టికల్ లో కాకుండా ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది.

ఈ WordPress Plugin గురించి క్షుణ్ణంగా తెలుసుకునడానికై క్రింద పేర్కొన్న లింక్ ని క్లిక్ చేయండి.

Yoast SEO WordPress Plugin ద్వార మీ వెబ్ సైట్ Search Engine Optimization పెంచుకోండి




WordPress Plugin : No.06 – Wordfence Security Plugin

వర్డ్ ఫెన్స్ సెక్యూరిటి ప్లగ్ ఇన్ : Wordpress Plugin : in Telugu లో ముఖ్యమయిన ప్లగ్ ఇన్ “Wordfence Security”.

ఈ ప్లగ్ ఇన్ మన వెబ్ సైట్ ఎటువంటి Malware బారిన పడకుండా చూస్తుంది.

సాధారణంగా ఈ ప్లగ్ ఇన్ కొన్ని థీంలలో ఆల్రెడి install అయి ఉంటుంది.

ఒకవేళ మీరు ఎన్నుకున్న Themeలో “Wordfence Security” Plugin లేకపోతే మీ WordPress డ్యాష్ బోర్డ్ లో Add New Pluginని క్లిక్ చేయండి.

Search bar లో “Wordfence Security” ఎంచుకొని ఈ ప్లగ్ ఇన్ ని Install చేసుకుని Activate చేసుకోనండి.




Wordpress-Plugin-in-Telugu-Wordfence-Security-Plugin

WordPress Plugin : No.07 – Custom Fonts Plugin 

కస్టం ఫాంట్స్ ప్లగ్ ఇన్ : WordPress Plugin లలో ఒకటైన “Custom Fonts Plugin” సహాయంతో మీరు అందమయిన మరియు ఆకర్షనీయమైన తెలుగు అక్షరాలతో వెబ్ సైట్ ని క్రియేట్ చేయవచ్చు.

ఈ Pluginని ఇన్స్టాల్ చేసుకోవడం మరియు దీని సహాయంతో మీరు అందమయిన మరియు ఆకర్షనీయమయిన అక్షరాలతో (అక్షరశైలితో-Font Style) Websiteలో ఎలా రాయడం గురించి WordPress Plugin : in Telugu Article లో కాకుండా, దీని గురించి ప్రత్యేకంగా ఇతర బ్లాగులో వివరించిన “How to create Website with beautiful and attractive Telugu Fonts” Article ని చదవండి.




WordPress Plugin : No.08 – W3 Total Cache Plugin

డబ్ల్యూ3 టోటల్ క్యాచే ప్లగ్ ఇన్ : WordPress Plugin లలో ఒకటైన “W3 Total Cache ప్లగ్ ఇన్”  మీ యొక్క వెబ్ సైట్ లోడింగ్ స్పీడ్ ని పెంచుతుంది.

లోడింగ్ స్పీడ్ ఎక్కువగా ఉన్న వెబ్ సైట్ లకి వీక్షకుల సందర్శన ఎక్కువగా ఉంటుంది. సాధరణంగా ఈ ప్లగ్ ఇన్ కొన్ని థీంలలో ఆల్రెడి install అయిఉంటుంది.

ఒకవేళ మీరు ఎన్నుకున్న Theme లో “W3TotalCache” Plugin లేకపోతే మీ WordPress డ్యాష్ బోర్డ్ లో Add New Pluginని క్లిక్ చేసి Search bar లో “W3TotalCache” ఎంచుకొని ఈ Pluginని Install చేసుకుని Activate చేసుకోవాలి.

w3-total-cache-plugin




2 thoughts on “WORDPRESS PLUGIN : IN TELUGU”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Get 30% off your first purchase

X