51 BLOG TOPICS IN TELUGU

51 Blog Topics in Telugu – Guide for Blogging Beginners

Blogging in Telugu Tutorials లో నేను మీకు Telugu Blog చేయడానికి (51) టాపిక్స్ ని ( 51 Blog Topics in Telugu for Beginners ) తెలియ జేయలనుకుంటున్నాను. 

ఇవి కాకుండా మీరు ఇంకా చాలా టాపిక్స్ పైన Blog రాయవచ్చు.  అయితే ఈ 51 Blog Topics in Telugu చదివిన తరువాత Blogging in Telugu చేయడానికి మీకు Blog టాపిక్స్ పై ఒక అవగాహన వస్తుంది అని అనుకుంటున్నాను. 

సాధారణంగా మనము ఎటువంటి Blog రాయలన్న దాని గురించి కొద్దిగా జ్ఞానం సంపాదించడం అవసరం. దీని కొరకు మళ్లి మనం English ఆర్టికల్స్ చదవడం తప్పని సరి.

ఇవి మనకు సరిగా అర్థం కావడానికి Online లొ గాని Offline లో గాని English to Telugu కొరకు వెతకవలసి వస్తుంది.

English to Telugu అనువాదం కొరకు మనం Online లో Google Translate ని ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం.

Google Translate కాకుండా English to Telugu అనువాదం మరియు అర్థములను Shabdakosh లాంటి వెబ్ సైట్ ల ద్వారా కూడా పొందవచ్చు.

51 Blog Topics in Telugu for Beginners బ్లాగ్ చదివే ముందు మీరు “ఉచితముగా వెబ్ సైట్/Blog ని క్రియేట్ చేయడం ఎలాగో” తెలుసుకునడానికి క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

Free Tutorial to learn Blogging in Telugu learn 

ఇప్పుడు మనం Blog రాయడానికి 51 Blog Topics in Telugu for Beginners ఏంటో సవివరముగా చూద్దాం. 




Blog Topics related to Computers

కంప్యూటర్స్, సాఫ్ట్ వేర్, మరియు ఇంటర్ నెట్ కి సంభందించినటువంటివి
Blog-topics-Computers-software

 

1. Blogging Tutorial in Telugu బ్లాగింగ్ ట్యుటోరియల్ :

మీకు వెబ్ సైట్ క్రియేట్ చేయడంలో నాలేడ్జి ఉంటే చక్కగా ఒక Blogging Tutorial స్టార్ట్ చేయవచ్చు.

Blog/వెబ్ సైట్ (Blogging) ఎలా చేయడం మరియు అందులో మెళకువలు మరి చిట్కాలు తెలియజేసే Blogging Tutorial Website మీరు సక్సెస్ ఫుల్ గా run చేయగలరు.

Blogging in Telugu లో కాంపిటిషన్ చాలా తక్కువగా ఉన్నందున మీ వెబ్ సైట్ కి చాల త్వరగా మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుండి.

2. Computers కంప్యూటర్స్:   

Computers కి సంభందిoచినటువంటి ఎటువంటి Article కైనా వీక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

మీరు వివిధ రకాల Computers గురించి History of Computers, Prices of Computers, అందులో ఉన్న ఫెసిలిటిస్ గురించి మంచి ఆర్టికల్  రాయవచ్చు. 

Computers యొక్క తెలుసుకునడానికి మీరు ఇంటర్ నెట్ లో బ్రౌజ్ చేసి చూస్తే చాలు. 

అంతే కాకుండా Laptop గురించి కూడా మీరు మీ Blog లో తెలియ జేయవచ్చు.

ఏ బ్రాండ్ Laptop ధర ఎంత. ఆ పర్టికులర్ Laptop లో గల సౌకర్యాలు ఏంటి అనే విషయాలను మీరు online లో సేకరించి వివిధ రకాల Laptop ల గురించి మీరు blogging in Telugu చేయవచ్చు.

ప్పుడయితే Gaming Laptop ల గురించి Google లో ఎక్కువ సెర్చ్ జరుగుతుంది.

ఎక్కువ సెర్చ్ జరిగే టాపిక్ ల పైన Blogging చేస్తే ఆటొమేటిక్ గా మీ Blog లకు సందర్షకులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.




3. Computer Hardware కంప్యుటర్ హార్డ్ వేర్ :

ఒక వేళ మీకు Computer Hardware కి సంభందించిన నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే, ఇటువంటి రకమయిన Blog లకు ప్రస్తుతం చాలా views వచ్చే అవకాశం ఉంది.

మీకు Computer Hardware సబ్జెక్ట్ మీద అంతగా పట్టు లేక పోయినా, ఇది తెలిసిన మిత్రుల సహాయంతో మరియు Internet లో బ్రౌజ్ చేసి కూడా ఈ టాపిక్ పైన మీరు చాల చక్కటి Blog రాయ వచ్చు.

Computer Hardware లో మీరు ఒక Computer ని అసెంబుల్ చేసే విధానమును మొదలుకుని Computer లో ఉన్న ప్రతీ Part గురించి వివరముగా రాయవచ్చు.

4. Computer Software కంప్యుటర్ సాఫ్ట్ వేర్ :

Computer Hardware లాగానే Computer Software సబ్జెక్ట్ కూడా వీక్షకులను విపరీతంగా ఆకర్షించ వచ్చు.

  • మీరు Types of Computer Softwares గురించి వివిధ రకాల Computer Softwares డౌన్ లోడ్ చేసుకుని వాటిని వాడే విధానం
  • డిఫరెంట్ వివిధ రకాల Computer Software ఉపయోగాలు
  • వివిధ రకాల Computer Software జాబ్స్ గురించి
  • Computer Software ఇంజనీరింగ్ గురించి…

ఇలా చెపుతూ పోతుంటే ఎన్నో రకాల Blog Topics మీకు Computer Software సబ్జేక్ట్ లోనే అందుబాటులో ఉన్నాయి.




Blog Topics in Telugu related to Women

మహిళలకు సంభందించినటువంటివి

5. Fashions ఫ్యాషన్స్ :

ఆడ వారికి మరియు మగ వారికి సంభందిచిన ఫ్యాషన్ డిజైన్స్ పై కూడా చాల చక్కని Blog రాయ వచ్చు.

ఇటివలి కాలంలో చాల ప్రాముఖ్యత సంతరించుకున్న Designer Sarees, Designer Blouses, Designer Kurtis, Designer Lehangas, Designer Dresses మరియు Designer Tops పైన ఆర్టికల్స్ ని మీ Blog లో చేర్చవచ్చు.

ప్రస్తుత కాలంలో భారత దేశంలో Designer Kurtis కి చాల ఎక్కువగా సెర్చ్ జరగడం గమనించవచ్చు.

ఈ ఫీల్డ్ లో మీ Blog కి సరియైన Search Engine Optimization చేసి మీ Blog కి మంచి ర్యాంకు తీసుకు రాగలిగితే, మీ Blog ద్వారా మీరు Online లో Google Adsense ద్వార మరియు Affiliate Marketing ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.

6. Ornaments Designs నగల డిజైన్స్: 

Ornaments and Ornaments Designs టాపిక్ ఆడ వారికి చాల ఇంట్రస్ట్ గా ఉంటుంది.

ఈ సెక్టర్ లో మీరు Gold Ornaments మరియు Silver Ornaments కి సంభందించిన విషయాలు మీ Blog లో చేర్చవచ్చు.

ప్రతి డిజైన్ కి సంభందించిన ఇమేజెస్ Blog కి జోడించడం ద్వారా మహిళా వీక్షకులను ఆకర్షించ వచ్చు. Blogging in Telugu లో ఈ రంగానికి చాల మంచి స్కోప్ ఉంటుంది.

ఈ ఫీల్డ్ లో మీ Blog కి సరియైన Search Engine Optimization పైన చేసి మీ Blog కి మంచి ర్యాంకు తీసుకు రాగలిగితే, మీ Blog ద్వారా మీరు Online లో Google Adsense ద్వార మరియు Affiliate Marketing ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.




7. Beauty Tips అందానికి చిట్కాలు:

Beauty Tips టాపిక్ కూడా మహిళా వీక్షకులను ఆకర్షించవచ్చు.

ఈ సెక్టర్ లో మీరు  Natural Beauty Tips, Ayurvedic Beauty Tips, Face Beauty Tips, Beauty Tips to grow Hair, Oil Skin, Dry Skin వారికి Beauty Tips ఇలా ఎన్నోరకాల Beauty Tips కి సంభందించిన Blog మీరు చేయవచ్చు. 

అంతేకాదు, మన పూర్వికుల నుండి గ్రహించిన అందానికి సంభందించిన ఎన్నో చిట్కాలను ఇందులో జోడించ వచ్చు.

8. Recipes వంటలు :

Blogging in Telugu Tutorials లో అతి ముఖ్యమయిన Topic ఇది.

ఈ రంగం లో క్రొత్త క్రొత్త వంటలు (Recipes) మరియు క్రొత్త క్రొత్త విధానాలు మనం చేర్చవచ్చు.

ఈ ఫీల్డ్ లో ప్రస్తుతము మహిళలే కాకుండా పురుషులు కూడా ఎక్కువ మక్కువ చుపుతున్నందున ఈ టాపిక్ గల Blog కి అధిక వీక్షకులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

క్రింద చూయించిన వంటలకు (Telugu Recipes) సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. 

  • Ulava Charu in Telugu, Ulava Charu Biryani in Telugu, Ulava Charu Special Recipes in Telugu
  • Chicken Biryani in Telugu, Chicken Palav in Telugu, Hyderabad style Chicken Dum Biryani in Telugu, Kunda Chicken in Telugu, Chicken-65 in Telugu, Chicken-555 in Telugu
  • Mutton Biryani in Telugu, Mutton Kababs in Telugu, Mutton Palav in Telugu, Muttona Paya Recipe in Telugu
  • Millets Recipes in Telugu, Recipes with Samalu, Arikelu
  • Recipes pertaining to Flexseed in Telugu

ఇవి కాకుండా ఇంకా ఎటువంటి రకాల వంటలకయినా మంచి ఫాలోయింగ్ ఉంటుంది.




Blog Topics in Telugu related to Comparison

వివిధ రంగాల లో సరి పోలుస్తూ Blog రాయడం. 

Blog-topics-Women-Fashions

నేను 2002 సంవత్సరం లో ఒక ఫ్రిజ్ కొన్నాను.

అప్పట్లో ఏదైనా క్రొత్త వస్తువు కొనాలంటే, దానికి సంభందిచిన షాప్ యజమాని వద్ద దాని గురించి తెలుసు కొనడం తప్ప వేరే ఇతర మార్గం ఉండేది కాదు.

కాని ఇప్పుడు పరిస్థితులు మారి పోయినాయి.

ఇప్పుడు ఏo కొనాలన్నా వాటి వివరాలను ఇంటర్ నెట్ లో వెతికిన తరువాతనే ఒక నిర్ణయానికి రావడం మనం గమనించ వచ్చు.

ఈ ప్రక్రియ బ్లాగర్స్ కి వరంగా మారింది.

ఏదేని ఒక కంపెనీ Item ని ఇతర కంపెనీ Item తో పోలుస్తూ మరియు వాటి మద్య గల తేడాలను తెలియజేస్తూ రాస్తున్న Blog ల పై వీక్షకులు చాల ఇంట్రస్ట్ చూయిసుతున్నారు.

అయితే ఇటువంటి Blogస్ ప్రస్తుతము ఇంగ్లీష్ లోనో, హింది లోనో ఉన్నాయి.

Blogging in Telugu లో చాల తక్కువగా ఉన్నాయి.

ఇప్పుడు మనం ఈ రంగం లో ఎన్ని టాపిక్స్ పైన బ్లాగింగ్ చేయవచ్చునో చూద్దాం.

9. Items Sector  వస్తువుల రంగంలో: 

వస్తువులను కంపేర్ చేస్తూ వాటి వివరాలను వీక్షకులకు వివరిస్తూ Blog రాయ వచ్చు. ఇవి ఏ వస్తువులు అయినా ఉండ వచ్చు.

ఉదాహరణకు : టి.వి.లు, ఫ్రిజ్ లు, సోఫాలు, టైల్స్, డోర్స్ ఇలా ఎన్నో రకాల వస్తువుల పై మనము కంపేర్ చేయవచ్చు.

10. Hardware Sector హార్డ్ వేర్ రంగంలో: 

కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్, మొబైల్స్, హెడ్ ఫోన్స్, బ్లూ టూత్స్, పెన్ డ్రైవ్స్ మరియు ప్రింటర్స్ లాంటి వస్తువుల పై మనము కంపేర్ చేయవచ్చు.

మరియు మీరు స్వయంగా ఈ వస్తువులను వాడినట్టయితే సందర్శకులకు మీ వెబ్ సైట్ ద్వారా correct suggestions కూడా ఇవ్వొచ్చు.




11. Automobiles Sector ఆటోమొబైల్స్ రంగంలో: 

మోటార్ సైకిల్స్, కార్లు, ట్రాక్టర్ లు, మోపెడ్స్ తదితర వాహనాలు ఈ రంగంలోకి వస్తాయి. ఉదాహరణకు Duet కి మరియు Activa లను పోలుస్తూ వాటి మధ్య తేడాలను తెలుపుతూ Blog చాల చక్కగా రాయ వచ్చు.

12. Hotels Sector హోటల్స్ రంగంలో:

పర్టికులర్ గా ఒక సిటి ని ఎంచుకొని, ఆ సిటిలొ ఉన్న హోటల్స్ ని మరియు లాడ్జిలని పోలుస్తూ Blog రాయవచ్చు. ఈ Blog లొ మీ రివ్యూ ని కూడా రాయవచ్చు.

13. Travel Field ట్రావెల్ రంగంలో:

ట్రావెల్ ఫేసిలిటిస్ రంగంలో వివిధ కంపెనీలను పోలుస్తూ బ్లాగా రాయ వచ్చు. ఇందులొ Uber, Ola, Meru, Savaari మరియు Orange Travels, Diwakar Travels, Kaveri Travels లాంటి కంపెనీల రేట్లను, ఫేసిలిటిస్ ని పోల్చవచ్చు. అంతేకాదు మీ ఏరియాలో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ గురించి కూడా రాయవచ్చు.

14. Function Halls Sector ఫంక్షన్ హాల్స్ :

మీ ఏరియాలో కాని Hyderabad, Vijayavada, Warangal, Vishakhapatnam, Nizamabad, Karimnagar, Guntoor లాంటి పెద్ద పెద్ద సిటి లలో ఉన్న ఫంక్షన్ హాల్స్ గురించి మరియు వాటి రేట్లను, వారు కలిపిస్తున్న వసతుల గురించి Blog రాయ వచ్చు.




Blog Topics in Telugu related to Education

ఎడ్యుకేషన్ రంగం :

Education-Courses

15. Education Sector విద్య మరియు విద్యావకాశాలు:

విద్య మరియు విద్యావకాశాల సబ్జెక్ట్ విద్యార్తులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఇందులో మీరు వివిధ కాలేజీల గురించి, యూనివర్సిటి ల గురించి రాయవచ్చు. అంతే కాకుండా, గతంలో ఈ కాలేజీలలో కాని యూనివేర్సిటిలలో కాని చదువు కున్న విద్యార్థులు ప్రస్తుతం ఏ ఏ స్టేజి లలో ఉన్నారో కూడా విశదికరించవచ్చు.

ప్రస్తుత జనరేషన్ విద్యార్థులు వారి కెరీర్ కొరకు ఎక్కువగా ఆధార పడడం మామూలు విషయం అయిపోయింది.

16. About Different Courses వివిధ కోర్సుల రంగంలొ:

ప్రస్తుతం విద్యార్థులు 10వ తరగతి, ఇంటర్ మిడియేట్, మరియు గ్రాడ్యుయేషన్ పూర్తీ కాగానే,  పిల్లల మరియు వారి తల్లిదండ్రులు తదనంతరం వారు ఎటువంటి చదువులు చదవాలి, ఏ కోర్సులలో వారికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నది అని తెలుసుకునడానికి ఇంటర్ నెట్ పైననే ఆధార పడుతున్నారు.  

తెలుగులొ ఈ ఫీల్డ్ లొ ఎక్కువ బ్లాగులు లేనందున, ఈ ఫీల్డ్ నందు మీ వెబ్ సైట్ కి ఎక్కువ వీక్షకులు వచ్చే అవకాశం ఉంది.

17. Online Learning Coursesఆన్ లైన్ కోర్సుల రంగం:

ఇప్పుడు ఆన్ లైన్ లొ చాల వరకు కోర్సులు అందుబాటు లొ ఉన్నాయి.

ఉదాహరణకు : ఫోటోగ్రఫీ, ఫోటోషాప్, వెబ్ డిజైనింగ్, సాఫ్ట్ వేర్ ట్రైనింగ్, హార్డ్ వేర్ ట్రైనింగ్ లాంటివి.

అయితే మీరు వీటి పైన మొదలు రిసెర్చ్ చేసి తరువాత మీ రివ్యూ ని రాస్తే బాగుంటుంది.

18. Books Sector పుస్తకాలు:

ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ పుస్తకాలపై రివ్యూ రాయవచ్చు.

19. MS Excel & MS Word ట్యుటోరియల్ :

MS Excel & MS Word లొ మెళకువలు, కి బోర్డ్ షార్ట్ కట్స్, ఫార్ములాలను తెలుపుతూ Blog చేయవచ్చు.

20. Study Materials స్టడీ మేటెరియల్:

విద్యార్థులకు అవసరమయిన స్టడీ మేటెరియల్ ఎక్కడ దొరికుతుంది, ఏది బాగుంటుంది అనే విషయాల పై Blog రాయ వచ్చు.

ఒక వేళ మీరు టీచింగ్ ఫీల్డ్ నకు సంభందించిన వారయితే మీరు తయారు చేసిన స్టడీ మేటెరియల్ కూడా పెట్ట వచ్చు.




21. Language Coaching Sector భాషలను నేర్పే Blog:

మీకు ఇతర ఏవేని భాష లపై పట్టు ఉంటే, ఆ భాషల్ని మీ Blog ద్వారా వీక్షకులకు నేర్పవచ్చు. ఇటువంటి Blog లకు ఒక సారి వచ్చిన వ్యక్తీ మళ్ళి మళ్ళి వచ్చే అవకాశం ఉంది.

22. Science Blogs సైన్స్ Blog:

సైంటిఫిక్ రిసెర్చ్, స్పేస్ సైన్స్, ఇన్నోవేటివ్ ప్రాడక్ట్స్, ఫ్యూచర్ టెక్నాలజీ వంటి విషయాల పై Blog చేయవచ్చు.

23. History Blog హిస్టరీ Blog:

మన దేశ చరిత్ర, మరియు చరిత్ర సృష్టించిన వ్యక్తులు, చారిత్రాత్మక కట్టడాల పై Blog చేయవచ్చు.




Blog Topics in Telugu related to Entertainment

ఎంటర్టైన్మెంట్ రంగం 

51-Blog-Topics-in-Telugu, Blog-Topics-related-to-Entertainment

24. Telugu Movies   తెలుగు సినిమాలు:

Blogging in Telugu లో ఈ రంగానికి చాలా ఆదరణ ఉంది.

ప్రతి నెల దాదాపు 3.00 లక్షలకు పైగా విజిటర్స్ Google Search Engine లో Telugu Movies కొరకు Search చేస్తుంటారు.

క్రొత్తగా వచ్చే Telugu Movies కొరకు Telugu Movies 2020 లేదా Telugu Movies 2019 లేదా Latest Telugu Movies లేదా New Telugu Movies అనే టిటిల్స్ తో చక్కని Blog రాయవచ్చు.

ప్రస్తుత సమయంలో ప్రతి నెలా దాదాపు లక్షకు పైగా సందర్శకులు Telugu Movies 2019 అనే Keyword తో Google Search Engine లో శొదన జరుపుతున్నారు.

అంతే కాకుండా పాత Telugu Movies గురించి, అంటే అందులో Hero మరియు Heroine ల గురించి, ఆ సినిమా యొక్క కధ గురించి మీరు ఇప్పుడు ఒక Old Telugu Movies Review రాయవచ్చు.

ఇటువంటి Telugu Movies పైన చేసే Blog లకు కూడా వీక్షకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ రంగంలొ ఉన్న వెబ్ సైట్ లను వీక్షకులు చాల బ్రౌజ్ చేస్తారు. వివిధ సినిమాల పై అవి కొత్తవి కావచ్చు పాతవి కావచ్చు రివ్యూ రాయ వచ్చు.

మరియు సిని హీరోల గురించి హీరోయిన్ ల గురించి, నటుల గురించి కూడా రాయవచ్చు.

25. Songs Sector పాటలు:

పాటల పై రివ్యూ మరియు పాటల యొక్క లిరిక్స్ తో Blog చేయవచ్చు.

26. TV Serials టి.వి. సీరియల్స్:

టి.వి. సీరియల్స్ పై రివ్యూ మరియు టి.వి. నటుల గురించి కూడా Blog చేయవచ్చు.

27. Top 10 :

ఈ రంగంలొ ఉన్న వెబ్ సైట్ లను వీక్షకులు చాల బ్రౌజ్ చేస్తారు.

Top 10 హీరోస్, Top 10 హీరోయిన్స్, Top 10 సాంగ్స్, Top 10 సీరియల్స్ లాంటివి.

28. Social Media సోషల్ మీడియా:

ప్రస్తుతం ట్రెండింగ్ లొ ఉన్న సోషల్ మీడియా పై Blog రాయవచ్చు.

29. Realty Shows రియాల్టి షోస్:

టి.వి. ల్లో వస్తున్నా రియాల్టి షోల పైన మీ రివ్యూని Blog ద్వారా వీక్షకులకు అందించ వచ్చు.

Big Boss-4 పైన ఒక ఆర్టికల్ రాయండి.  Day1 నుండి మీ వెబ్ సైట్ కి వీక్షకులు ఎక్కువ మొత్తంలో సందర్శిస్తారు.

30. Music & Music Instruments సంగీతము మరియు వాయిద్యాల పైన :

మీరు ఈ రంగంలొ టచ్ ఉన్న వారైతే ఆన్లైన్ లొ మెళుకువలను అందించడానికి చక్కని Blog రాయ వచ్చు.

ఇటువంటి Blog లకు ఒక్క సారి వచ్చిన వ్యక్తీ, మళ్ళి చాల సార్లు తిరిగి వస్తారు.

31. Dance డ్యాన్స్ మెళకువలు :

పైన టాపిక్ లొ పేర్కొన్నట్టు ఆన్లైన్ లొ డ్యాన్సింగ్ మెళుకువలను అందించడానికి చక్కని Blog రాయ వచ్చు. వీటికి కూడా ఒక్క సారి వచ్చిన వ్యక్తీ, మళ్ళి చాల సార్లు తిరిగి వస్తారు.




Blog Topics related to Children

పిల్లలకు సంభందించినటువంటివి 

51-Blog-Topics-in-Telugu, Blog-Topics-related to Children

32. New Names of Kids పిల్లల పేర్లు :

పుట్ట బోయే పిల్లలకు కాని ఇంకా పేర్లు పెట్టని పిల్లలకు క్రొత్త పేర్లు వెతకడానికి తల్లి దండ్రులు ఇప్పుడు ఆన్ లైన్ లోనే సెర్చ్ చేస్తున్నారు. వివిధ రకాల పేర్లతో కూడిన Blog మీరు రాయ వచ్చు.

33. Dresses of Kids పిల్లల డ్రెస్సుల పైన :

పిల్లలకు ఎటువంటి డ్రెస్సులు బాగుంటాయి, ఏ కంపెని వైతే మన్నికగా ఉంటాయి. కొత్త కొత్త డిజైనేర్ డ్రెస్ ల గురించి Blog రాయవచ్చు.

34. Kids Playing Items పిల్లల ఆట వస్తువుల పై:

పిల్లలు ఆడుకుంటూనే knowledge ని గ్రహించే ఆట వస్తువులు ఇప్పుడు మార్కెట్ లోకి చాల వస్తున్నాయి. వీటి పైన కూడా Blog రాయ వచ్చు.




General Blog Topics

జనరల్ Blog టాపిక్స్: 

51-Blog-topics-in-Telugu, General-Blog-Topics

35. Current Affaris వర్తమాన విషయాలు: 

వర్తమానం లో జరుగుతున్న విషయాల Current Affairs గురించి.

36. Health and Fitness ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ : 

నిత్యం మన లైఫ్ లో కావలసిన Health and Fitness Tips.

37. Excercise  వ్యాయామం మరియు యోగా: 

మీకు ఈ రంగం లో ప్రవేశం ఉంటే, వ్యాయామం మరియు యోగా పైన చక్కటి Blog తయారు చేయవచ్చు.

మీరు ఈ టాపిక్ పై ఇంగ్లీషులో కూడా Blog రాయ వచ్చు.

38. Meditation ధ్యానము  : 

ధ్యానము ఎలా చేయాలి, ఎంత సేపు చేయాలి, ధ్యానము వలన కలుగు లాభాలు తదితర వివారలను పేర్కోంటు చక్కని Blog రాయవచ్చు.

39. Personality Development & Motivation వ్యక్తిత్వ వికాసం:

వ్యక్తిత్వ వికాసం సంభందించినటువంటివి. (Personality Development & Motivation)

40. Stock Market స్టాక్ మార్కెట్ :

మీకు స్టాక్ మార్కెట్ కి సంభందించిన విషయాల పై అవగాహన ఉంటే, ప్రస్తుతం ఇది బెస్ట్ టాపిక్.

స్టాక్ మార్కెట్ కి సంభందించిన చిట్కాలు, మరియు పెట్టుబడులు ఎలా పెట్టాలి అనే విషయాలపై చాల చక్కని Blog రాయవచ్చు.




41. Agriculture వ్యవసాయము:

వ్యవసాయమునకు సంభందించిన వివిధ రకముల మెళకువలను తెలుపుతూ Blog రాయ వచ్చు.

ఇదే Blog లో మీరు ఫెర్టిలైజర్ ల గురించి, వ్యవసాయ పని ముట్ల గురించే కాకుండా, టైం టు టైం ప్రభుత్వం వ్యవసాయదారులకు అందిస్తున్న సదుపాయాలను కూడా జోడించ వచ్చు.

42. Horticulture ఉధ్యానవనాలు మరియు పండ్ల తోటలు:

ఉధ్యాన వనాలు, పూల తోటలు మరియు పండ్ల తోటల కు సంభందించిన మెళకువలను తెలుపుతూ రాయండి.

ఏ సీజన్ లో ఏ పూల తోటలు కాని ఏ పండ్ల తోటలు కాని పెడితే లాభాలు గడించ వచ్చో తెలియ జేయండి.

దీని కొరకు మీకు తెలియక పోతే దీనికి సంభందించిన నిపుణుల వద్ద తెలుసుకుని రాయ వచ్చు.

43. Business Ideas బిజినెస్ ఐడియాలు :

మీకు తెలిసిన బిజినెస్ ఐడియాలు మీ Blog ద్వార ఇతరులకు షేర్ చేయ వచ్చు.

44. Matrimony పెళ్లి సంభందాలు :

మీ కమ్యూనిటీ లో కాని మీ లొకాలిటి లో ఉన్న పెళ్లి సంభందాల వివరాలను సేకరించి వారి అనుమతితో వారి ఫోటోలను వెబ్ సైట్ లో ఉంచి వీక్షకులను ఆకర్శించ వచ్చు.

45. Sports & Games Blog స్పోర్ట్స్ & గేమ్స్:

ఈ రంగం లో చాలా టాపిక్స్ మనకు లభిస్తాయి. క్రికెట్ గాని, కబడ్డి గాని, స్విమ్మింగ్ గాని ఇలా ఎన్నో ఆటల గురించి మీ Blog లో పేర్కొన వచ్చు.

ఆ పర్టికులర్ ఆట ఎలా ఆడాలి, ఆ ఆట లో గల రూల్స్ & రెగ్యులషన్స్ మరియు ఆ ఆట కు సంభందించిన మెళకువలను మీరి వీక్షకులకు అందించ వచ్చు. 

అంతే కాకుండా విరాట్ కోహ్లి, యువారాజ్ సింగ్ ఇలా ఆటగాళ్ల గురించి కూడా రాయ వచ్చు.  I.P.L., రంజీ ట్రోఫి లాంటి టొర్నమెంట్స్ గురించి కూడా రాయవచ్చు.

ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న PUBJ గేం పైన కూడా Article రాయవచ్చు. 




46. Telugu News తెలుగు వార్తలు :

Blogging in Telugu Tutorials లో మీ వెబ్సైట్ త్వరగా మంచి ర్యాంక్ ని సాధించడానికి సహాయపడే Topic గురించి వివరిస్తాను.

మీ ప్రాంతము యొక్క వార్తలను ఎప్పటికప్పుడు Telugu News లో అందించవచ్చు.

ఒక వీక్షకుడు Telugu News ని మీ వెబ్సైట్ ద్వారా చదవడం ఒకసారి మొదలు పెడ్తే ఆ User ప్రతి రోజు మీ వెబ్ సైట్ ని Telugu News కొరకు సందర్శిస్తాడు.

అయితే మీరు ఈ Telugu News ని ప్రతినిత్యం update చేస్తుండాలి.

Telugu News Papers లలో కాని ఇతర ఏ News Paper లొ అయినా నిన్నటి వార్తలు ఈ రోజు చదువుతారు.

TVలలో అయితే ఎప్పటి వార్తలు అప్పుడు వస్తాయి కాని, ఒక వీక్షకునికి అవసరమైన వార్త కొరకు ఆ వ్యక్తి నిరంతరం టి.వి. ముందర కూర్చున వలసి వస్తుంది.

ఇటువంటి Telugu News ని మీరు ఎప్పటికప్పుడు Update చేయగలిగితే, మీ వీక్షకులకు ఎటువంటి Telugu News అవసరమయినా వెంటనే మీ వెబ్ సైట్ ని సందర్శిస్తారు.

ఈ విధమయిన Returning User లతో మీ Website Traffic విపరీతముగా పెరగడమే కాకుండా Search Engine ర్యాంకింగ్ కూడా త్వరగా పెరిగే అవకాశాలు ఉంటాయి.

ఇటువంటి వెబ్సైట్ ల కొరకు మీరు ప్రత్యెకంగా Youtube లో మీ Telugu News Channel ని క్రియేట్ చేసుకోవాలి.

ఇందులో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసిన వీడియోలను మీ Website లో చేర్చితే, మీ Telugu News వెబ్సైట్ చాలా త్వరగా పాపులర్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

47. Small Scale Industries కుటీర పరిశ్రమలు :

మీకు తెలిసిన కుటీర పరిశ్రమల గురించి మీరు భ్లాగ్ రాయవచ్చు.

48. Real Estate Sector రియల్ ఎస్టేట్:

మీ లోకాలిటి లో గల రియల్ ఎస్టేట్ వ్యాపారము గురించి రాయవచ్చు. దీని మీద మీరు పెర్సనల్ గా ద్రుష్టి కేంద్రీకరిస్తే దీని ద్వార మీరు లోకల్ మార్కెట్ లో డబ్బులు కూడా సంపాదించ వచ్చు.

49. Government Schemes ప్రభుత్వ స్కీముల గురించి :

డే టు డే వెలువడే ప్రభుత్వ స్కీం లను వివరిస్తూ మీరు రాయ వచ్చు.

50. Telephone Directory:

మీ లొకాలిటీ లో గల వ్యక్తుల, బిజినెస్ పెర్సన్స్ యొక్క మరియు ఆఫీసర్ల యొక్క మరియు ఆఫిస్ సిబ్బంది యొక్క టెలిఫోన్ నంబర్లను సేకరించి ఒక Blog తయారు చేయవచ్చు. 

ఈ Blog చూసిన వీక్షకులు ఇందులోనే Telephone నంబర్లను సెర్చ్ చేసే అలవాటు అయిన తరువాత మీరు ఇందులో లోకల్ అడ్వర్టైజ్ మెంట్స్ ప్లేస్ చేసి లోకల్ మార్కేట్ లో డబ్బులు కూడా సంపాదించవచ్చు.

Example: http://adilabadcontacts.blogspot.com




51. Interior Designing:

కొత్తగా కట్టె బిల్డింగ్ లకు మరియు పాత బిల్డింగ్ లను అప్ డేట్ చేయుటకై ఈ Blog ఉపయోగ పడుతుంది.

ఈ రంగంలో కనుక మీకు అనుభవం లేనట్టయితే నిపుణులైనటువంటి సివిల్ ఇంజనీర్ల వద్ద వీటి గురించి తెలుసుకుని మీరు బ్లాగింగ్ చేయవచ్చు.

ఈ Article మీకు ఉపయోగ పడుతుందని నేను అనుకుంటున్నాను.

మీ అభిప్రాయాలను మరియు Blogging లో మెలకువల కోసమై క్రీంద కామెంట్ బాక్స్ లో తెలుపండి. నేను తప్పకుండా మీకు సహాయ పడగలను.

పైన పేర్కొన (51) Blog టాపిక్స్ 51 BLOG TOPICS IN TELUGU ని చూసిన తరువాత మీకు బ్లాగింగ్ టాపిక్ ల పై ఒక అవగాహన కలిగిందనుకుంటున్నాను. ఇప్పుడు పైన చూయించిన 51 BLOG TOPICS IN TELUGU కాకుండా తెలుగులో బ్లాగింగ్ చేయుటకై మీరు స్వయంగా ఎన్నో టాపిక్ లను కనుగొనగలుగుతారని ఆశిస్తున్నాను.




17 thoughts on “51 BLOG TOPICS IN TELUGU”

    1. S .. Srinu gaaru.. ‘stories in telugu’ ki Google search lo demand baagane undi.. n competition kuda thakkuva undi… U may go with this topic…

  1. First of all Thank you for explaining the blog for natural ways very well, and such a great blog post with us. If you can, use Herbal hair Tq

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Get 30% off your first purchase

X