SEO : SEARCH ENGINE OPTIMIZATION IN TELUGU

SEO : SEARCH ENGINE OPTIMIZATION IN TELUGU

SEO : Search Engine Optimization meaning in Telugu (సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏమిటి?) Uses of SEO : Search Engine Optimization in Telugu (దీని ఉపయోగం ఏమిటి) మరియు  How to do Search Engine Optimization in Telugu (సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి) అనేది మీకు ఈ బ్లాగ్ లో తెలుపదలుచుకున్నాను.

తెలుగులో బ్లాగింగ్ Blogging in Telugu చేసిన తరువాత Telugu blog లలో మీ వెబ్ సైట్ కి మంచి ర్యాంకింగ్ రావాలంటే ఖచ్చితంగా ఈ Article లో సూచించిన అంశాలను మీరు implement చెయాలి.




సాధారణంగా మీకు తెలిసే ఉంటుంది, ఒక వెబ్ సైట్ ని మనము క్రియేట్ చేసిన తరువాత, Search Optimisation Engines (Google, Yahoo, Bing etc.,)  ఆ వెబ్ సైట్ కి  ర్యాంకింగ్ ఇవ్వడమే కాకుండా సదరు వెబ్ సైట్ లను ఒక క్రమ పద్దతిలో వీక్షకులకు చూయించడం జరుగుతుంది.

వీక్షకులు తమకు కావలసిన వెబ్ సైట్ లను ఈ సెర్చ్ ఇంజన్ వెబ్ సైట్ లలో వెతికి వాటిని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ సెర్చ్ ఇంజన్ లు నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ఉంటాయి.

ఈ సెర్చ్ ఇంజన్ లలో ఒక వెబ్ సైట్ కి మంచి ర్యాంకుని తీసుకురావడానికి చేసే ప్రక్రియనే SEO – Search Engine Optimization అంటారు.

దీని కొరకు కొన్ని సూచనలను పాటించడం ద్వారా మీ వెబ్ సైట్ కి మంచి ర్యాంకు వచ్చే అవకాశము కలదు.

Blogging for beginners in Telugu లో మొదలు మనం Search Engine Optimization ఎన్ని రకాలు అనేది వివరంగా చూద్దాం.

ఒక వెబ్ సైట్ యొక్క ర్యాంకింగు కై Search Engine లు రెండు విధాలుగా ఆప్టిమైజేషన్ చేస్తాయి.




1. On page Optimisation

ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అనగా మీ వెబ్ సైట్ దేని గురించి రాసారో దాంట్లో ఉన్న Titleని, Keywordsని, Meta Tagsని, Inter linksని Search Engine Bots రిసీవ్ చేసుకుని మరియు పరిశీలించి మీ వెబ్ సైట్ కి ర్యాంకు ఇవ్వడం. On page Optimisationని రెండు భాగాలుగా చూడవచ్చు.

  • i)On Site SEO : ఆన్ సైట్ SEO అంటే మొత్తం సైట్ ని పరిశీలించి చూసి ర్యాంకింగు ఇవ్వడం. దీంట్లో వెబ్ సైట్ పేరును మొదలుకొని పెర్మా లింక్ ని మరియు సైట్ మ్యాప్ తదితర విషయాలను దృష్టి లో పెట్టుకొని పరిశీలించడం.
  • ii)One Page SEO : ఆన్ పేజ్ SEO అంటే ఒక బ్లాగ్ పోస్ట్ ని పరిశీలించి చూసి ర్యాంకింగు ఇవ్వడం. దీంట్లో కంటెంట్ ని, మీరు టార్గెట్ చేసిన కి వర్డ్స్ ని మరియు హెడింగ్స్, సబ్ హెడింగ్స్ తదితర చాలా విషయాలను దృష్టి లో పెట్టుకొని పరిశీలించడం.




2.  Off-Page Optimisation

ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అనగా మీ వెబ్ సైట్ కి సంభందం లేకుండా పరిశీలన జరిపేది. ఉదాహరణకు “backlinks” బ్యాక్ లింక్స్ అంటే ఇతర వెబ్ సైట్ ల నుండి మీ వెబ్ సైట్ ని చూడమని రికమండ్ చేస్తూ రిఫర్ చేసే లింక్స్.

ఇప్పుడు మనం SEO : Search Engine Optimisation ఎలా చేయాలి? తద్వారా మీ వెబ్ సైట్ కి ఒక మంచి ర్యాంకు ఎలా తీసుకు రావాల అనేది చూద్దాం.

SEO కొరకు ముఖ్యంగా మనము క్రింద పేర్కొన్న (07) Search Engine Optimization Techniques పైన ద్రుష్టి పెట్టాల్సి ఉంటుంది.

నేను వరుసగా ఈ (07) విషయాలను తెలియజేస్తూ వాటిని ఎలా ఉపయోగించాలో వివరిస్తాను.




SEO -1 : CONTENT

SEO Search Engine Optimisation-Google-Trends

SEO : Search Engine Optimization కొరకు ముఖ్యంగా కావలసినది వెబ్ సైట్ యొక్క కంటెంట్.

ఒక విధంగా చెప్పాలంటే కంటెంట్ వెబ్ సైట్ యొక్క గుండె అన్న మాట.

అందుకే అంటారు …. Content is King ! అని.  

మీరు రాసే వెబ్ సైట్ యొక్క కంటెంట్ చాల క్లియర్ గా వీక్షకులకు అర్థమయ్యేలా ఉండాలి. మినిమం 800 పదాలు ఉండేటట్టు చూసుకోవాలి.

మీరు రాసే  సబ్జెక్ట్ పైన మీకు ఎంత మంచి అవగాహన మరియు పట్టు కలిగి ఉంటే అంత మంచిగా కంటెంట్ ని రాయవచ్చు. 

అంతే కాకుండా మీరు ఎన్నుకున్న కంటెంట్ వీక్షకులకు అవసరమయి ఉన్నది కాని, జిజ్ఞాస కలిగించేది కాని ఉండాలి. 

ఒక వ్యక్తీ Search Engine లో ఒక టాపిక్ గురించి సెర్చ్ చేస్తున్నాడంటే ఆ టాపిక్ అతనికి అవసరమయి ఉన్నది అన్నట్టే.




SEO -2 : KEY WORDS :

ఒక వ్యక్తికి అవసరం అయిన విషయమును సెర్చ్ చేయడానికి ఆతను ఉపయోగించే పదాలనే “Key Words” అని అంటారు.

కొన్ని “Key Words” యొక్క సంకలనమును “Key Phrase” అంటారు.

ఒక కంటెంట్ ని ఎన్నుకుని రాయడం మొదలు పెట్టకన్నా ముందు ఈ కంటెంట్ లో ని వీక్షించడం కొరకు వచ్చే User సెర్చ్ ఇంజన్ లో ఎటువంటి “Key words” ని టైపు చేస్తాడో తెలుసుకుని, ఆ కీవర్డ్స్ ని కంటెంట్ లొ ఉండేటట్టు చూసుకోవాలి.

ఉదాహరణకు ఒక వ్యక్తీ “తెలుగు లొ బ్లాగ్గింగ్ ఎలా చేయాలి” అని తెలుసుకోవాలంటే, సాధారణంగా ఆ వ్యక్తీ సెర్చ్ ఇంజన్ లొ “blogging in Telugu” అని గాని “Create Website in Telugu” అని గాని “How to blog in Telugu” అని గాని search చేస్తాడు.

మీ కంటెంట్ ఒకవేళ “తెలుగు లొ బ్లాగ్గింగ్ ఎలా చేయాలి” అయితే పైన పేర్కొన్న కీవర్డ్స్ ని మీ కంటెంట్ లొ ఉండేటట్టు చూసుకోవాలి.

గూగుల్ లో కాని లేక ఇతర ఏదేని సెర్చ్ ఇంజన్ లలో మీరు ఎంచుకున్న కంటెంట్ లో ఎటువంటి  Key words కి ఎక్కువ ర్యాంకు పొందుతాయో క్రింద పేర్కొన్న టూల్స్ ని ఉపయోగించి తెలుసుకునవచ్చు.




Ahrefs – Keyword Generator :

Ahrefs.com వారు ప్రెజెంట్ చేసిన Keyword Generator Tool బ్లాగింగ్ లో బిగినర్స్ కే కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. 

ఈ టూల్ సహాయంతో చాలా ఈజి గా మీరు Keywords ని జనరేట్ చేసుకునవచ్చు.

మీరు https://ahrefs.com/keyword-generator  లింక్ ని క్లిక్ చేయడం ద్వారా Keyword Generator ని ఒపెన్ చేయవచ్చు.

Ahrefs-Keyword-Generator

ఒపెన్ అయిన పేజిలో మీరు ఏ సెర్చ్ ఇంజన్ లో Keyword ని సెర్చ్ చేయాలనుకుంటున్నారో (Google, Bing, Youtube or Amazon)Search Engine ని ఎంచుకోవాలి.

తరువాత Search Bar లొ మీరు రాయాలనుకుంటున్న టాపిక్ ని టైప్ చేసి, ఏ దేశానికి సంభందించిన వీక్షకులను టార్గెట్ చేయాలనుకుంటున్నారో, ఆ దేశమును ఎంపిక చేసుకుని “Find Keywords” అనే బటన్ ని క్లిక్ చేయండి.

SEO-Ahrefs-Keyword-Generator

అంతే మీ టాపిక్ కి సంభందించిన 100 Keywords మీ తెర మీద ప్రత్యక్షమవుతాయి. 

అంతే కాదు ప్రతి Keyword ఎదురుగా ఆ Keyword యొక్క వాల్యూం ని కూడా చూయించబడుతుంది. 

ఇందులో గల Keywords ని మీరు సెలెక్ట్ చేసుకుని వాటినే మీ టాపిక్ లో విరివిగా వాడుతూ ఆ Keywords నే టార్గెట్ చేయాలి. 




Answer-the-Public/Keyword-generator :

ఈ టూల్ కూడా Keywords ని చాల బ్రహ్మాండంగా జనరేట్ చెస్తుంది.

మీరు https://answerthepublic.com/  లింక్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ Keyword Generator ని ఒపెన్ చేయవచ్చు.

SEO-answer-the-public-toolఒపెన్ అయిన పేజిలో మీరు Search Bar లొ మీరు రాయాలనుకుంటున్న టాపిక్ ని టైప్ చేసి, ఏ దేశానికి సంభందించిన వీక్షకులను టార్గెట్ చేయాలనుకుంటున్నారో, ఆ దేశమును ఎంపిక చేసుకోవాలి.

మీరు ఏ భాషలో Keywords కావాలని అనుకుంటున్నారో ఆ భాషని సెలెక్ట్ చేసుకుని  “Search” బటన్ ని క్లిక్ చేయండి.

అంతే మీకు కావలసిన Keywords అన్నియు క్రింద ఇమేజ్ లో చూయించినట్టుగా కనిపిస్తాయి. ఇందులో గల Keywords ని మీరు సెలెక్ట్ చేసుకుని వాటినే మీ టాపిక్ లో విరివిగా వాడుతూ ఆ Keywords నే టార్గెట్ చేయాలి. 

SEO-answer-the-public-tool




Questiondb:

ఒక User ఏదేని ఒక విషయము కోరకు సెర్చ్ చేసినప్పుడు సాధారణంగా, దానిని ఒక ప్రశ్న రూపంలో సెర్చ్ ఇంజన్ లో టైప్ చేయడం జరుగుతుంది.

ఉదాహరణకి ఆ User “Search Engine Optimisation” గురించి తెలుసు కోవాలంటే, ఆయన సెర్చ్ చేసే విధానం “What is Search Engine Optimisation” అని కాని “How can I improve Search Engine Optimisation in my Website” అని కాని ఇలా ప్రశ్నల రూపంలో సెర్చ్ చేయడం జరుగుతుంది. 

User ఎటువంటి ప్రశ్నలని సెర్చ్ లో టైప్ చేస్తాడో, అటువంటి ప్రశ్నలని గుర్తించి వాటిని మనకు అందించే ఈ టూల్ పేరు “Questiondb” Tool.

 

Questiondb-Search-Engine-Optimisation

“Questiondb” Tool పేజి ఓపెన్ చేయాగానే వచ్చే సెర్చ్ బార్ లో మీకు కావలసిన కీవర్డ్స్ టైప్ చేసి “Generate” అన్న బటన్ క్లిక్ చేయగానే, క్రింద ఇమేజ్ లో చూయించినట్టుగా మీరు ఉపయోగించడానికి అనువుగా ఉన్న Question కీవర్డ్స్ అన్ని వరుసగా వస్తాయి. 

వీటిలో ముఖ్యమయిన వాటిని మీరు ఎంపిక చేసుకుని మీ కంటెంట్ లో ఆ యా కీవర్డ్స్ ఉండేటట్టు చూసుకోవాలి.

Questiondb-2




Google Trends :

గూగుల్ ట్రెండ్స్ టూల్ మీరు ఎంపిక చేసుకున్న Keyword గూగుల్ సెర్చ్ లో ఏ విధముగా ట్రెండ్ చేస్తున్నది అని తెలుసుకునడానికి ఉపయోగపడుతుంది.

ఇంకా ముఖ్యమయిన విషయం ఏంటంటే మీరు  గూగుల్ ట్రెండ్స్ పేజి ఓపెన్ చేయగానే మీకు ఆ రోజు ఏ టాపిక్స్ ఎక్కువగా సెర్చ్ అవుతున్నాయి అనేది సెర్చ్ కౌంట్ తో సహా చూయిస్తుంది. 

Daily Blogs రాసేవాళ్ళకి ఇది ఎంతో సహాకారంగా ఉంటుంది.  

SEO-Search-Engine-Optimization-in-Telugu-Google-Daily-search-Trends

Google Trends పేజి ఒపెన్ చేయగానే “Explore topics” అనే సెర్చ్ బార్ లో మీరు ఎంపిక చేసుకున్న Keyword ని టైప్ చేసి “Search” బటన్ క్లిక్ చేయండి.

వెంటనే క్రింద ఇమేజ్ లో చూయించినట్టుగా Search Graph కనబడుతుంది.

మీ కీవర్డ్ యెలా ట్రెండ్ చేస్తుంది అనేది ఈ గ్రాఫ్ ని చూసి అర్థం చేసుకోవచ్చు.

ఇందులో మీరు ఏ దేశంలో మీరు పర్టికులర్ గా మీ కీవర్డ్ ని టార్గేట్ చేస్తున్నారో, లేదా ఎంత కాలము నుండి మీకు సెర్చ్ ఇండేక్స్ కావాలి లాంటి తదితర విషయాలను కూడా ఎంపిక చేసి చూసుకొనవచ్చు.  

SEO-Search-Engine-Optimization-in-Telugu-Google-Trends

అంతే కాదు, మీరు పర్టికులర్ గా ఒక దేశం లోని ఏ ఏ ప్రాంతాలలో   మీ కీవర్డ్ ఎంత మేరకు ట్రెండ్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు.

ఉదాహారణకి క్రింది ఇమేజ్ చూడండి. Search Engine Optimisation అనే కీవర్డ్ కి వివిధ రాష్ట్రాలలో (Sub Region) ఎంత మేరకు ట్రెండ్ అవుతుందో చూడవచ్చు.

SEO-Search-Engine-Optimization-in-Telugu-Google-Trends-Sub-Region-wise

Google Search :

పైన పేర్కొన్న టూల్స్ కాకుండా మనము రెగ్యులర్ గా use చేసే గూగుల్ సెర్చ్ ద్వారా కూడా మీరు Keywords ని ఎంపిక చేసుకోవచ్చు.

Google Search బార్ లో మీరు మీ టాపిక్ ని టైప్ చేయగానే క్రింద కనపడే suggestions లోని పదాల్ని మీరు Keywords ని ఎంపిక చేసుకునవచ్చు.

SEO-Search-Engine-Optimization-Google-Search-suggestions

అంతే కాకుండా మీరు మీ టాపిక్ ని సెర్చ్ బార్ లో టైప్ చేయగానే దానికి సంభందించిన Websites కాకుండా Google Search పేజి మధ్యలో “People also ask” బాక్స్ కనపడుతుంది.

దాని క్రింద ఇతర Users రెగ్యులర్ గా అడిగే search items కనిపిస్తాయి. 

దీంట్లో గల పదాలను కూడా  Keywords గా ఎంపిక చేసుకునవచ్చు.

SEO-Search-Engine-Optimization-Google-Search-People-also-ask




SEO Search Engine Optimization in Telugu-3 : Outbound Links

మీ వెబ్ సైట్ లో కొన్నీ Outbound links కూడా ఉండాలి.

Outbound links అంటే మన వెబ్ సైట్ నుండి ఇతర వెబ్ సైట్ లకు ఇచ్చే లింక్స్.

సెర్చ్ ఇంజన్ లు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు Outbound links ని కూడా చూస్తాయి.

ఉదాహరణకి ఈ బ్లాగ్ లో పైన చూయించిన Keyword Tools యొక్క websites అన్నింటికి నేను లింక్ ఇవ్వడం జరిగింది.

SEO Search Engine Optimization in Telugu-4 : Internal Links :

మీ వెబ్ సైట్ లో కొన్నీ Internal links కూడా ఉండాలి.

Internal links అంటే మన వెబ్ సైట్ నుండి మన వెబ్ సైట్ లో ఉన్న ఇతర పోస్ట్ లకు ఇచ్చే లింక్స్. సెర్చ్ ఇంజన్ లు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు Internal links ని కూడా చూస్తాయి.

ఉదాహరణకి WordPress లో ముఖ్యమయిన Plugins కొరకు క్రింద పేర్కొన్న లింక్ ని క్లిక్ చేయండి.

వర్డ్ ప్రెస్ లో (08) ముఖ్యమయిన ప్లగ్ ఇన్స్

పైన  కనిపిస్తున్న “వర్డ్ ప్రెస్ లో (08) ముఖ్యమయిన ప్లగ్ ఇన్స్” అనే సెంటెన్స్ కి నేను ఈ వెబ్ సైట్ లో గల నా ఇతర పోస్ట్ కి లింక్ ఇవ్వడం జరిగింది. 

SEO Search Engine Optimization in Telugu-5 : Images

వెబ్ సైట్  వీక్షకులకు ఇంట్రస్ట్ కలిగేలా ఉండాలంటే, మీ ప్రతీ పోస్ట్ లో ఖచ్చితంగా ఇమేజెస్ ని జోడించండి.

సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ లో ఇదీ ముఖ్యమయిన పాయింట్.

ఇమేజ్ లను జోడించడమే కాకుండా, ఇమేజ్ పేరులో కాని, Alt Text లో కాని, Description లో కాని మీరు ఎంపిక చేసుకున్న కీవర్డ్స్ అన్ని ఉండేటట్టు చూసుకోండి.

SEO Search Engine Optimization in Telugu-6 : Site Title Length

మీ వెబ్ సైట్ టైటిల్ పొడవు ఖచ్చితంగా 50 నుండి 60 అక్షరాల మధ్య ఉండాలి.

SEO Search Engine Optimization in Telugu-7 : Keyphrase

  • మనము ఎంపిక చేసుకున్న కీ వర్డ్స్ యొక్క సముహముని Keyphrase అంటారు.
  • Keyphrase మీ వెబ్ సైట్ యొక్క టైటెల్ లో ఉండేటట్టు చూసుకోవాలి.
  • అంతే కాకుండా ఈ Keyphrase  మీ వెబ్ సైట్ introduction అనగా 1st Paragraph లో ఉండాలి.
  • Keyphrase పొడవు 150 నుండి 160 అక్షరాల వరకు ఉండాలి.
  • Keyphrase కంటేంట్ లో మినిమం (05) సార్లు వచ్చేటట్టు చూసుకోవాలి.




SEO Search Engine Optimisation in Telugu-8 : Yoast SEO Plugin

Search Engine Optimization (SEO) సక్రమంగా చేయడానికి WordPress లో Yoast SEO Plugin చాలా సహకరిస్తుంది. ఈ ప్లగిన్ ని ఇన్స్టాల్ చేసి దీని ద్వారా SEO ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

WordPress Dash Board లొ గల ప్లగిన్ బటన్ క్లిక్ చేసి Add New Plugin ని ఎంచుకొండి.

తరువాత New Apps Search బార్ లో Yoast SEO అని టైప్ చేసి రిజల్ట్స్ లో వచ్చే Yoast SEO Plugin ని install చేసి Activate చేయండి. 

SEO-Search-Engine-Optimization-Yoast-SEO-Installation

మీరు మీ వెబ్ సైట్ పోస్ట్ లో కంటెంట్ రాసిన తరువాత ఈ Yoast ప్లగిన్ సహాయంతో Search Engine Optimization చాల సునాయసంగా చేయవచ్చు.

క్రింద ఇమేజ్ లో చూయించినట్టు మీరు రాసిన పోస్ట్ క్రింద Yoast SEO సజెషన్స్ కనిపిస్తాయి.

Yoast-SEO-Analysis-SEO-Search-Engine-Optimization

పై ఇమేజ్ లో చూయించిన Analysis Results లో ఉన్న సజెషన్స్ ఫాలో అయి వాటిని సరి చేసిన తరువాత క్రిందీ ఇమేజ్ లో చూయించినట్టు “Good Results” మీకు వస్తాయి.

Yoast-SEO-Analysis-SEO-Search-Engine-Optimization

పైన సూచించిన సూచనలు పాటించడం ద్వారా మీ వెబ్ సైట్ కి త్వరలోనే మంచి ర్యాంక్ వస్తుంది.

ప్రస్తుత కాలంలో Telugu లో Digital Marketing వెబ్ సైట్ లు చాల తక్కువగా ఉన్నందున మీకు Competition కూడా తక్కువగా ఉంటుంది.

How to create Website – వెబ్ సైట్ చేయడం గురించి Teluguలో  నేర్చుకుని మీరు వెంటనే మీ వెబ్ సైట్ ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను.

ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, Digital Marketing ద్వారా Onlineలో డబ్బు సంపాదించుటకై, మీ వెబ్ సైట్ కు తప్పని సరిగా Search Engine Optimization చేయవలసి ఉంటుంది.

Onlineలో డబ్బు సంపాదించడం ఎలా? తెలుసుకునడానికి Digital Marketing in Telugu మరియు Earn Money Online with Google Adsense బ్లాగ్ లను వీక్షించండి.

త్వరలోనే ఈ SEO full course in Telugu ని మీకు నేను వీడియోల ద్వారా Youtube లో ఉచితంగా అందిస్తాను.

దీనితో మీ వెబ్ సైట్ కీ మీరు SEO : Search Engine Optimization కంప్లీట్ చేసినట్టే.   My best wishes with you….. Bye



5 thoughts on “SEO : SEARCH ENGINE OPTIMIZATION IN TELUGU”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Get 30% off your first purchase

X