CREATE WEBSITE : TELUGU WORDPRESS-TUTORIAL

CREATE WEBSITE : TELUGU WORDPRESS-TUTORIAL

Create Website : Telugu WordPress-Tutorial for blogger beginners – వర్డ్ ప్రెస్ సహాయంతో వెబ్ సైట్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఈ బ్లాగ్ లో మీకు చెప్ప దలచుకున్నాను. Blogging in Telugu లొ ఇది చాలా ముఖ్యమయిన Article.

CREATE WEBSITE : WORDPRESS-TUTORIAL LESSON-I

HOW TO GET DOMAIN & WEBHOSTING

Create Website : Telugu WordPress-Tutorial for blogger beginners యొక్క మొదటి Article లో వెబ్ హోస్టింగ్ మరియు డొమైన్ నేమ్ ఖరీదు చేయడం మరియు వాటిని configure చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఒక వేళ మీరు ఉచితంగా Website ని క్రియేట్ చేయదలుచుకుంటే Blogging in Telugu for free ని క్లిక్ చేయండి.

Domain Name : 

Create Website : Telugu WordPress-Tutorial for blogger beginners సబ్జేక్ట్ లోకి వెళ్ళే ముందు Domain Name గురుంచి తెలుసుకుందాం.

మన ఇంటి అడ్రస్ తెలుసుకోవటానికి మన ఇంటికి పేరు గాని హౌజ్ నంబర్ గాని ఎలాగైతే ఉంటుందో,  అదేవిధంగా మన వెబ్ సైట్ ని  వీక్షకులు చూడటానికి ఒక వెబ్ సైట్ అడ్రస్ ఉంటుంది.  దీనినే డొమైన్ నేమ్ అంటారు.

డొమైన్ నేం చివర .com, .in,  .co.in, .net లాంటి ఎక్స్టెన్షన్ తో ఉంటాయి.

సాధారణంగా ఏదేని సెర్చ్ ఇండెక్స్ లో మంచి ర్యాంకింగ్ రావాలంటే .com గాని ఇండియాలోకల వీక్షకులను దృష్టిలో పెట్టుకుంటే .in గాని ఖరీదు చేసుకోవాలి.

Domain Name సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్రింద చూయించిన అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.

  • Domain Name వీలయినంత చిన్నదిగా ఉండేటట్టు చూడాలి.
  • ఇది పలుకడానికి సులువుగా ఉండాలి.
  • డొమైన్ నేంలో వీలయినంతవరకు మనము ఎన్నుకున్న Keywords ఉండేటట్టు చూడాలి.
  • Domain Name బ్రాండెడ్ అయి ఉంటే ఇంకా చాలా మంచిది.
  • మీరు ఏ టాపిక్ పైన వెబ్ సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్  వీలయినంతవరకు డొమైన్ నేంలో ఉండేటట్టు చూడాలి.

ఉదాహరణకు నేను Blogging in Telugu టాపిక్ పై వెబ్ సైట్ క్రియేట్ చేయదలుచుకున్నాను కాబట్టి ఈ వెబ్ సైట్ కి blogintelugu.com అనే Domain Name సెలెక్ట్ చేసుకున్నాను.

Web Hosting :

మన ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఏవిధంగానైతే అవసరమో, వెబ్ సైట్ ని ఉంచటానికి కూడా స్థలం అవసరం. దీనినే వెబ్ హోస్టింగ్ అంటారు.  ఈ  వెబ్ హోస్టింగ్ ని  వివిధ కంపెనీలు వివిధ ధరలకు అందిస్తుంటాయి. 

సాధారణంగా ఒక మంచి వెబ్ హోస్టింగ్ కంపెనీని మనం ఎంపిక చేసుకోక పోవడం వలన తరువాత కొన్ని ప్రాబ్లంస్ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు  

  • పేజి లోడింగ్ చాల నెమ్మదిగా జరుగవచ్చు. ఇలా జరిగితే మన వెబ్ సైట్ ని ఓపెన్ చేసే విక్షకుడు త్వరగా దానిని క్లోజ్ చేసి ఇంకొక వెబ్ సైట్ కి వెళ్ళే అవకాశం ఉంది.
  • ఇంతే కాక, వైరస్ త్రెట్ కూడా ఉండొచ్చు.
  • రెగ్యులర్ గా సర్వర్ ఫెయిల్ అవ్వొచ్చు.

ఒక సారి మన వెబ్ సైట్ క్రియేట్ చేసిన తరువాత ఇంకొక వెబ్ హోస్టింగ్ కంపెనీకీ మారడం అనేది చాలా పెద్ద సమస్య.

ఒక సారి తక్కువ డబ్బులకు వస్తుంది కదా అని “Webspace Mart” వారి వద్ద నేను వెబ్ హోస్టింగ్ తీసుకునడం జరిగింది.

ఈ కంపెని వారు నాకు చుక్కలు చూయించినారు.

అసలు వెబ్ సైట్ లోడ్ అవడం అంటూ జరగదు.

కస్టమర్ కేర్ ఎక్జిక్యూటివ్స్ కి అసలు ఏమి తెలువదు. సర్వర్ తరచుగా క్రాష్ అవుతూ ఉంటుంది.

కంపెనీ నుండి మనకు ఎటువంటి సహాయం అందదు.

నేను రెగ్యులర్ గా use చేసేది మరియు నేను రికమండ్ చేసేది Hostgator Webhosting.

ఈ కంపెనీ లో ఏ ప్లాన్ తీసుకున్నా కాని, వెబ్ సైట్ లోడింగ్ లో గాని, సర్వర్ నియంత్రణ లో గాని ఇతర ఎటువంటి సమస్యలు ఉండవు.

మరియు 24 గంటలు అందుబాటులో ఉండే కస్టమర్ కేర్ చాట్ సర్వీసు నుండి త్వరితమైన సహాయం పొందటం జరుగుతుంది.




HOW TO CONFIGURE DOMAIN NAME & WEB-HOSTING

ఇప్పుడు వెబ్ హోస్టింగ్ మరియు డొమైన్ ఖరీదు చేసి, డొమైన్ నేం మరియు వెబ్ హోస్టింగ్ కన్ఫిగర్ చేయడం ఎలాగో చూద్దాం.

ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు హోస్ట్ గేటర్ కంపెనీ నుండి వెబ్ హోస్టింగ్ ఖరీదు చేసుకోగలరు. క్రింద పేర్కొన బడిన లింక్ నా Hostgator Affiliate లింక్.

దీనిని నేను ఎప్పుడు update చేస్తూ ఉంటాను. కొత్త ఆఫర్స్ ఏవి వచ్చినా, Discount Coupons ఏవి వచ్చినా నేను రెగ్యులర్ గా update చేస్తూ ఉంటాను.

కాబట్టి మీరు తక్కువ ధరలో వీటిని పొందవచ్చు. అంతే కాదు ఈ లింక్ ద్వార మీరు ఖరీదు చేసినప్పుడు నాకు కూడా కొంత కమీషన్ రావడం జరుగుతుంది.

HostGator Web Hosting

పై లింక్ క్లిక్ చేసిన తరువాత ఓపెన్ అయ్యే Hostgator పేజి మెనూ లో క్రింద ఇమేజ్ లో చూయించినట్టు Web Hosting ని క్లిక్ చేసి Linux Shared Hosting ని క్లిక్ చేయండి. 

పై లింక్ క్లిక్ చేసిన తరువాత ఓపెన్ అయ్యే పేజి లో క్రింద ఇమేజ్ లో చూయించినట్టు ఎదేని ఒక Plan ఎంపిక చేసుకోండి. ఒక వేళ మీరు blogger beginner అయితే Starter Pack సరిపోతుంది. 

hostgator-webhosting-plans

Hostgator లో Webhosting తో పాటు .net డొమైన్ ఉచితంగా ఇస్తారు. 

మీరు .net domain కావాలనుకుంటే, Domain ఉచితంగా తీసుకునడానికి ఉన్న లింక్ ని క్లిక్ చేసి నెక్స్ట్ పేజి లోకి వెళ్ళ వచ్చు.

ఒక వేళ మీరు .com లేదా .in domain ఖరీదు చేయాలనుకుంటే ఇక్కడ ఓపెన్ అయిన Pop up Box లో No అని క్లిక్ చేయండి.

తరువాత ఓపెన్ అయ్యే పేజి లో క్రింద ఇమేజ్ లో చూయించినట్టు మీ Domain Name టైప్ చేయండి.

తరువాత, Backup your Hard work, Encrypt Sensitive Information, Protect your site from Hackers ముందు గల చెక్ బాక్స్ లను un-trick చేసి Continue బటన్ ప్రెస్ చేయండి.

వీటిక్ Extra డబ్బులు కట్ట వలసి ఉంటుంది. ఇవేవి మనకి అవసరము లేదు.

ఇప్పుడు మీ ప్రాడక్ట్ ఆర్డర్ సమ్మరి పేజి ఓపెన్ అవుతుంది.

తరువాత మీరు “Continue” బటన్ క్లిక్ చేయడం ద్వార Payments పేజిలోకి వెళ్ళడం జరుగుతుంది.

మీరు payment చేసిన తరువాత మీ మేయిల్ అడ్రస్ కి payment invoice మరియు control panel User Name, Password తదితర విషయాలు మేయిల్ చేయబడుతాయి. 

ఇప్పుడు Hostgator Home పేజి లో “My Account” బటన్ క్లిక్ చేసి మీ Admin Area పేజి ని ఓపెన్ చేయండి. 

“My Account”  యొక్క యూజర్ నేం మరియు పాస్ వర్డ్ మీరు Hostgator వారికి ఇచ్చిన మేయిల్ అడ్రస్ కి వస్తాయి.




Name Servers Setting

Admin area పేజి మెనూ లొ గల Manage Orders ట్యాబ్ Drop-down లిస్టులో List/Search Orders ని క్లిక్ చేయడం ద్వారా మీ డొమైన్ మరియు వెబ్ హోస్టింగ్  కంట్రొల్ పేజి లొకి వెళ్తారు.

డొమైన్ మరియు వెబ్ హోస్టింగ్  కంట్రొల్ పేజి లో మీరు ఇప్పటి వరకు ఖరిదు చేసిన డొమైన్స్ మరియు వెబ్ హొస్టింగ్ లిస్ట్ ఉంటుంది. ఇందులో మీరు మీ వెబ్ హొస్టింగ్ లింక్ ని క్లిక్ చేయండి.

తరువాత ఓపెన్ అయ్యే పేజి లో మీ డొమైన్ సెట్టింగ్స్ మరియు వెబ్ హోస్టింగ్ సెట్టింగ్స్ కనిపిస్తాయి.

మీరు సింగిల్ డొమైన్ హోస్టింగ్ తీసుకుంటే “Single Domain Linux Hosting” అని, ఒకవేళ ఎక్కువ డొమైన్స్ కొరకు హోస్టింగ్ తీసుకుంటే “Multi Domain Linux Hosting” అని ఈ పేజిలొ కనిపిస్తాయి. 

నేను “Multi Domain Linux Hosting” తీసుకున్నాను కాబట్టి క్రింది ఇమేజ్ లో చూయించినట్టు పేజి ఓపెన్ అయ్యింది.

ఇందులో మీరు “Name Server Details” పైన క్లిక్ చేయండి.

ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో మీ డొమైన్ యొక్క నేమ్ సర్వర్స్ కనిపిస్తాయి సాధారణంగా ఇవి రెండూ ఉంటాయి వీటిని కాపీ చేయండి.

తర్వాత బ్యాక్ బటన్ ప్రెస్ చేసి ఇంతకు ముందు పేజీ లోకి వచ్చి “Domain Registration” బాక్స్ లో కనిపిస్తున్న నేమ్ సర్వర్ అనే ట్యాబ్ ని క్లిక్ చేయండి

ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో నేమ్ సర్వర్స్ లిస్టు కనిపిస్తుంది.  ఇందులో ఆల్రెడీ ఏవైనా నేమ్ సర్వర్స్ ఉంటే వాటిని డిలీట్ చేసి మీరు ఇంతకుముందు కాపీ చేసిన (02) నేమ్ సర్వర్ లను వరుసగా పేస్ట్ చేయండి. 

పేస్ట్ చేసిన తర్వాత క్రింద కనిపిస్తున్న Update Name Servers అన్న బటన్ ని క్లిక్ చేయండి.  

ఇంతటితో Domain Name వెబ్ హోస్టింగ్ తో configure చేయడం పూర్తి అయినట్టే. 

కొద్ది సమయం తర్వాత మీరు మీ వెబ్ సైట్ యొక్క Cpanel ఓపెన్ చేసుకోవచ్చు.

పైన చూపించిన ప్రక్రియలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే 24 గంటలు అందుబాటులో ఉండే Hostgator కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ తో చాట్ చేసి మీ సమస్యలను క్లియర్ చేసుకునవచ్చు.

మీరు ఏ ఇతర Web Hosting తీసుకున్నా డొమైన్ మరియు వెబ్ హోస్టింగ్ కన్ఫిగర్ చేసే విధానము పైన చూయించినట్టే ఉంటుంది.

CREATE WEBSITE : WORDPRESS-TUTORIAL LESSON-II :




CPANEL & INSTALLATION OF WORDPRESS SOFTWARE 

Create Website : Telugu WordPress-Tutorial for blogger beginners యొక్క రెండవ Article లో వెబ్ సైట్ Cpanel గురించి మరియు అందులో WordPress Softfare Install చేయడం ఎలాగో తెలుసుకుందాం.

వెబ్ హోస్టింగ్ మరియు డొమైన్ నేమ్ ఖరీదు చేసినప్పుడు Hostgator  వాళ్ళు మీకు మీ వెబ్ సైట్ యొక్క “Cpanel” User Name మరియు Password మీ మెయిల్ కు పంపిస్తారు.

URL అడ్రస్ బార్ లో domainname.com/cpanel అని టైప్ చేస్తే క్రింద ఇమేజ్ లో కనిపించేటటువంటి పేజి ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ Username మరియు Password టైప్ చేసి లాగిన్ అవ్వండి.

Create-Website~ Telugu-Wordpress-Tutorial

ఇప్పుడు ఓపెన్ అయిన కంట్రొల్ ప్యానెల్ (Cpanel) లో SOFTWARE అన్న సెక్షన్ లో Softaculous Apps Installer అన్న ట్యాబ్ ని క్లిక్ చేయండి.

తరువాత ఓపెన్ అయిన Softaculous పేజి లో క్రింద ఇమేజ్ లో కనిపించినట్టు “WordPress” Icon కనిపిస్తుంది.  దానిని క్లిక్ చేసి WordPress ని install చేయండి.

Create-Website~ Telugu-Wordpress-Tutorial

ఒక రెండు లేదా మూడు నిమిషాలలో “WordPress” install అవుతుంది. Installation పూర్తి అవుతుంది.

తరువాత వచ్చే పేజిలో మీరు కొన్ని Details ఫిల్ చేయాల్సి ఉంటుంది. “Choose Installation URL” అన్న కాలంలో మీరు మీ Domain Name రాయల్సి ఉంటుంది.

“Site Name” అనే ఫీల్డ్ లో మీ సైట్ కి మీరు పెట్టదలుచుకున్న పేరుని ఫిల్ చేయండి.

అదేవిధంగా సైట్ డిస్క్రిప్షన్ అన్న ఫీల్డ్ లో మీ వెబ్సైట్ దేని గురించి రాస్తున్నారో దాని వివరాలు సంక్షిప్తంగా రాయండి.

అడ్మిన్ User Name లో మీరు సెలెక్ట్ చేసుకున్న యూజర్ నేమ్ ఫీల్ చేయండి.

అదేవిధంగా అడ్మిన్ Password కూడా మీరు ఫీల్ చేయండి.

దాని కింద గల field లో మీ ఇమెయిల్ అడ్రస్ రాయండి.

తర్వాత క్రింది భాగంలో కనిపించే ఏదేని ఒక Theme ను సెలెక్ట్ చేసుకొని “Install” బటన్ పైన క్లిక్ చేయండి.

WordPress Software install అయినట్టు ఒక మెసేజ్ మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది
Wordpress-Installation, Create-Website~ Telugu-Wordpress-Tutorial Wordpress-software-install, Create-Website~ Telugu-Wordpress-Tutorial




CREATE WEBSITE : LESSON-IIII

HOW TO CONFIGURE THE SETTINGS IN WORDPRESS

Create Website : Telugu WordPress-Tutorial for blogger beginners యొక్క మూడవ పాఠంలో WordPress Platform ని configure చేయడం ఎలాగో తెలుసుకుందాం.

WordPress install చేసిన తర్వాత మనం మన వెబ్ సైట్ ని వర్డ్ ప్రెస్ ప్లాట్ ఫాం లో ఓపెన్ చేయడానికి బ్రౌజర్ అడ్రస్ బార్లో మీ domainname.com/wp-admin అని టైప్ చేయాలి. 

క్రింద ఇమేజ్ చూపించినట్టు User Name ‘or’ eMail address అని ఒక ఫీల్డ్ మరియు Password అని ఇంకొక ఫీల్డ్ తో వర్డ్ ప్రెస్ ప్లాట్ ఫామ్ Page ఓపెన్ అవుతుంది.  

దీంట్లో మీ వర్డ్ ప్రెస్ User Name లేదా eMail address గాని టైప్ చేసి మీ Password ఎంటర్ చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేయండి.

user-name, email-address, configure-wordpress-platform, Create-Website~ Telugu-Wordpress-Tutorial

క్రింద ఇమేజ్ లో చూపించినట్టు మీ వెబ్ సైట్ యొక్క వర్డ్ ప్రెస్ ప్లాట్ ఫామ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది.  

Settings:

లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న మెనూ లో ఉన్న సెట్టింగ్స్ ని క్లిక్ చేసి జనరల్ ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకోండి.

పక్కనే కుడివైపున కనిపిస్తున్న ముఖ్యమైన ఫీల్డ్స్ ని ఫీల్ చేయండి.  

ఇందులో మీరు రెగ్యులర్గా వాడే మెయిల్ ఐడి మరియు Time zone లో లో మన Time zone India లొ అయితే UTC+5.30 అని సెలెక్ట్ చేసుకోండి.

తర్వాత క్రిందకి వచ్చి సేవ్ చేయండి

Time-Zone, Create-Website~ Telugu-Wordpress-Tutorial

అలాగే Settings క్రింద కనిపించే రీడింగ్ అన్న బటన్ ప్రెస్ చేయండి. 

పక్కనే కుడి వైపున “For each Post in a feed include” అన్న కాలంలో Summary రేడియో బటన్ ను సెలెక్ట్ చేసుకోండి తర్వాత క్రిందికి వచ్చి సేవ్ చేంజెస్ అనే బటన్ ని క్లిక్ చేయండి

అదేవిధంగా సెట్టింగ్స్ లో గల Permalinks Tab నీ సెలెక్ట్ చేసుకొని కుడివైపున Post Name అనే రేడియో బటన్ నీ క్లిక్ చేసి సేవ్ చేయండి.

Permalinks, Create-Website~Telugu-Wordpress-Tutorial

తర్వాత Plugins Tab  క్లిక్ చేసి Add New అనే బటన్ సెలెక్ట్ చేసుకొని కొన్ని ముఖ్యమైన plugins డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. 

వర్డ్ ప్లస్ లో Attractive Website క్రియేట్ చేయడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన Plugins గురించి తెలుసుకునడానికి క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి.




8 USEFUL PLUGINS IN WORDPRESS

Useful-plugins-in-Wordpress, Create-Website~ Telugu-Wordpress-Tutorial

CREATE WEBSITE : WITH WORDPRESS  LESSON-IV :

HOW TO CREATE AN ATTRACTIVE WEBSITE ON WORDPRESS PLATFORM

Create Website : Telugu WordPress Tutorial for blogger beginners యొక్క నాలుగవ మరియు చివరి పాఠంలో WordPress Platform సహాయం తో Website create చేయడం ఎలాగో తెలుసుకుందాం.

Theme

ఇతరులకి గాని మనకి గాని మన ఇల్లు అందంగా కనపడటానికి ఎలాగయితే మంచి కలర్స్ వేసి చక్కగా డెకోరేట్ చేస్తామో అదే విధంగా వీక్షకులకు మన వెబ్ సైట్ అందంగా కనపడటం కొరకు ఒక మంచి థీం ని సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది.

మీ వెబ్ సైట్ యొక్క Theme రెస్పాన్సివ్ అయి ఉండాలి. అంటె మీ వెబ్ సైట్ Desktop Computer లో గాని Tab లోగాని Mobile లొ గాని చూడటానికి అనుకూలంగా ఉండాలి.

దీని కొరకు డాష్ బోర్డ్ మెనూలో కనిపిస్తున్న Appearance అనే బటన్ ని క్లిక్ చేసి కుడివైపున వచ్చే WordPress Themesలో మీకు నచ్చిన Theme ని సెలెక్ట్ చేసుకోండి. 

ఇవి కాకుండా Add New Themes బటన్ పై క్లిక్ చేయడం ద్వారా కొత్త WordPress Theme లను కూడా ఎంపిక చేసుకోవచ్చు.

నేనైతే ASTRA అనబడే WordPress Themeనీ వాడతాను.

ఈ Theme సింపుల్ గా మరియు వెబ్సైట్ క్రియేట్ చేయడానికి చాలా సౌకర్యం గాను ఉంటుంది. 

వెబ్సైట్ ఎడిటింగ్ కొరకు ఈ  WordPress Theme లొ  చాలా Options ఉన్నాయి.

మీకు నచ్చిన WordPress Theme ని సెలెక్ట్ చేసుకొని దానిని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి




Wordpress-Theme,Create-Website~ Telugu-Wordpress-Tutorial

Posts

Dash Board మెనూలో కనిపిస్తున్న Posts Tab లో Add New Post ని సెలెక్ట్ చేసుకొని మీరు రాయలి అనుకుంటున్న పోస్ట్ ని ఎంటర్ చేయండి.

మొదలు Add Title లో వెబ్ సైట్ యొక్క టైటిల్ ని టైప్ చేయండి తర్వాత క్రింద కనిపిస్తున్న Body లొ matter రాయండి. ఇందులో మీరు ఇమేజెస్ కూడా Upload చేయవచ్చు.

మీ బ్లాగ్ రాయడం ముగిసిన తర్వాత కుడివైపు కనిపిస్తున్న పబ్లిష్ అనే బటన్ పైన క్లిక్ చేయండి,

దీంతో మీ వెబ్సైట్ పబ్లిష్ అయిపోతుంది.  Beginners కి Blog Topics పైన ఒక అవగాహన రావడానికి  “51 Blog Topics in Telugu” Article ని వీక్షించండి.

Add-new-post,Create-Website~ Telugu-Wordpress-Tutorial




Menu

మీరు రాయదలుచుకున్న పోస్ట్ లను కంప్లీట్ చెసిన తరువాత, మీరు కావలనుకున్న పోస్ట్ లను Menu లో పెట్టుకొవచ్చు. 

మీ Dash Board లో Appearance క్రింద కనబడే Menus Tab ని క్లిక్ చేయండి.

కుడి వైపున Add Menu Items క్రింద కనబడే Posts ని క్లిక్ చేయండి. 

మీరు ఇప్పటి వరకు క్రియేట్ చేసిన Posts యొక్క లిస్ట్ కనబడుతుంది.   

ఇప్పుడు మీరు మెను బార్ లో పెట్టాలనుకుంటున్న పొస్ట్ కి ఎదురుగా ఉన్న check-box ని సెలెక్ట్ చేసుకుని క్రింద కనిపిస్తున్న Add to Menu బటన్ ని క్లిక్ చేయండి.

మీరు Add చేసిన పోస్ట్ లు ఇప్పుడు ప్రక్కనే ఉన్న Menu Structure Box లో కనిపిస్తాయి. ఆ ప్రక్కనే ఉన్న Save బటన్ నొక్కడం ద్వారా మీ మెనూ బార్ రెడి అయిపోతుంది. 

Menu-structure-Create-Website~ Telugu-Wordpress-Tutorial

క్రింద చూపిన లింక్స్ మీకు చాలా ఉపయోగపడవచ్చు.

Blogging in Telugu Lessons లో Create Website : Telugu WordPress Tutorial for blogger beginners ఆర్టికల్ మీకు ఉపయోగ పడుతుందని అనుకుంటున్నాను. దయ చేసి మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయగలరు.  




15 thoughts on “CREATE WEBSITE : TELUGU WORDPRESS-TUTORIAL”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Get 30% off your first purchase

X