DIGITAL MARKETING COURSE IN TELUGU

DIGITAL MARKETING-COURSE IN TELUGU

Digital-Marketing-Course-in-Teglugu

DIGITAL MARKETING-COURSE IN TELUGU లో మొదలు What is Digital Marketing – డిజిటల్ మార్కెటింగ్ అంటె ఏమిటో తెలుసుకుందాం.

ఒక బిజినెస్ నకు “ఆన్ లైన్ (Online)” ద్వారా మరియు “డిజిటల్ మాధ్యమముల (Social Media)” ద్వార  వినియోగదారులను తీసుకునివచ్చి వివిధ Items ని ఆన్ లైన్ ద్వారా వినియొగదారులకు అందజేయడాన్ని Digital Marketing అంటారు.

ఈ రోజుల్లో Digital Marketing Course లు చాలా మంది వివిధ ధరలకు మరియు కొందరు ఉచితంగా అందిస్తున్నారు.

అయితే ఇవి తెలుగు భాషలో చాలా తక్కువగా ఉన్నందున, నేను మీకు Digital Marketing-Course in Telugu ఉచితంగా అందించదలచుకున్నాను.

ఈ బ్లాగులో నేను

  • What is Digital Marketing? డిజిటల్ మార్కేటింగ్ అంటే ఏంటి?
  • How to do Digital Marketing? డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి

అనే విషయాల్ని తెలియ జేయదలుచుకున్నాను.




What is Digital Marketing? డిజిటల్ మార్కేటింగ్ అంటే ఏంటి?

ఇటీవలి కాలంలో ప్రజలు ఎటువంటి విషయాన్నైనా తెలుసుకునడానికి  ఆన్‌లైన్ ని వినియోగించడం చాలా సాదారణం అయిపోయింది.

ఇక్కడ ఎవరైనా తమ ఉత్పత్తులను కాని ఇతరుల ఉత్పత్తులను కాని ఆన్‌లైన్‌లో లేదా ఇతర డిజిటల్ మాధ్యమంలో ప్రకటన చేసి ఆదాయము సమకూర్చుకోవచ్చు.

అమ్మకందారులు కూడా తమ ఉత్పత్తికి ఆన్లయిన్ ద్వారా ఒక సముచిత స్థానాన్ని సృష్టించే అవకాశాన్ని పొందుతున్నారు.

Digital Marketing ద్వారా అమ్మకందారులు తమ  ఉత్పత్తి యొక్క వివరాలను వెబ్ సైట్ మరియు సోషల్ మీడియా ప్రకటల ద్వారా కస్టమర్‌కు ఎక్కడైనా మరియు ఎప్పుడైనా ప్రకటించడానికి అవకాశం దొరికింది.

అదే విధముగా వినియోగదారులు ఇటువంటి వెబ్ సైట్ మరియు సోషల్ మీడియా ప్రకటలను అధ్యయనం చేసి వస్తువులను కొనడం  మొదలయింది.

డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అమ్మకందార్లకు ప్రకటనల నిమిత్తం ఖర్చులు తగ్గడమే కాకుండా వినియోగదారులకు తమకు నచ్చిన వస్తువులను ఎంపిక చేసుకొనడం చాల సులువయి పోయినందున ఇటీవలికాలంలో ఈ ఫీల్డ్ విపరీతమయిన ప్రాచుర్యాన్ని పొందడం మనం గమనించవచ్చు.

ఇంటర్నెట్‌ లో Digital Marketing రాక ముందు,  ఒక వస్తువుని మార్కెటింగ్ చేయాలంటే చాల ఖర్చుతో ఉండడమే కాక చాల శ్రమించాల్సి వచ్చేది.

కాని ప్రస్తుత Digital Marketing యుగంలో ఒక వస్తువుని మార్కెటింగ్ చేయడం చాలా సులభ సాధ్యమయిపోయింది.

ఒక వెబ్ సైట్ లో కేవలం కంటెంట్‌ను ప్రచురించడం మరియు ఆ వెబ్ సైట్ కు వీక్షకులను తీసుకురావడం ద్వారా చాల సులువుగా మరియు తక్కువ ఖర్చుతో మార్కెటింగ్  చేయవచ్చు.

Digital Marketing ద్వారా చాల తక్కువ పెట్టుబడితో చాల మంది కొన్ని వేల రూపాయల నుండి కొన్ని లక్షల రూపాయలు ప్రతి నెలా సంపాదిస్తున్నారు. అలాగే చాల మంది ఈ ఫీల్డ్ లొ ఫెయిల్ కూడా అవుతున్నారు.

ఈ వ్యక్తులు ఫెయిల్ అవడానికి కారణం సక్సెస్ అయిన వ్యక్తులు పాటించిన నియమాలు మరియు మార్గాలు పాటించక పోవడమే కావచ్చు.




How to do Digital Marketing? డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి?

Digital Marketing చేయాలంటే ..

  • మీకు ఎటువంటి qualification అవసరం లేదు.
  • ఎక్కువ పెట్టుబడి పెట్ట వలసిన అవసరం లేదు.
  • మీ యొక్క మొత్తం సమయం దీని కొరకు వెచ్చించ వలసిన అవసరం లేదు.
  • మీరు Digital Marketing పార్ట్ టైం చేయవచ్చు లేదా ఫుల్ టైం చేయవచ్చు.

Digital Marketing చేయాలంటే మీకు కావాల్సిందల్లా …

  • ఒక కంప్యుటర్ లేదా ఒక ల్యాప్ టాప్
  • స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్
  • వెబ్ సైట్ క్రియేట్ చేయడం తెలిసి ఉండడం.
  • Socal Media లో ప్రావిణ్యం కలిగి ఉండడం
  • Marketing పైన అవగాహన కలిగి ఉండడం
  • మీరు Marketing చేయాలనుకునే వస్తువు పైన పూర్తీ పట్టును కలిగి ఉండి దానిని విశ్లేషించే సామర్థ్యం కలిగి ఉండాలి.
  • మీరు క్రియేట్ చేసిన Web site నకు వీక్షకులను తీసుకురావడానికి అవసరమయినటువంటి Site Engine Optimisation జ్ఞానం కలిగి ఉండడం.

పైన పేర్కొన బడిన విషయాలను నేర్చుకొనడానికి ప్రస్తుత మార్కెట్ లో  అనేక రకములయిన కోర్సులు Online లొ మరియు Offline లో వివిధ ధరలకు అందుబాటులో ఉన్నాయి.

కాని కొద్దిగా శ్రద్ధ వహించి నిరంతరం శ్రమించడం ద్వారా మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉచితంగానే “Digital Marketing”   కోర్సుని నేర్చుకునవచ్చు.

నా వరకు నేను ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా “Digital Marketing” కోర్సు నేర్చుకునడానికి ఖర్చు చేయలేదు. కేవలం ఉచితముగా లభ్యమవుతున్న websites చదివి మరియు Youtube వీడియోలను చూసి నేర్చుకునడం జరిగినది. అంతేకాదు, నేను కేవలం ఖాళిగా ఉన్న సమయంలో మాత్రమే “Digital Marketing” నేర్చుకున్నాను.

అయితే ఈ Websites మరియు Youtube Videoలు ఆంగ్ల మాధ్యమంలొ ఉండడం వలన నేర్చుకునడానికి కొద్దిగా ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఎక్కువ శ్రమించాల్సి వచ్చింది.

ఈ సబ్జెక్ట్ గురించి తెలుగులో ఎక్కువ ఆర్టికల్స్ గాని Youtube Video లు గాని లేకపోవడం వలన నేను తెలుసుకున్న విషయాలను మీతో పంచుకునడానికి ఈ బ్లాగ్ రాస్తున్నాను.

అంతేకాదు ఈ బ్లాగ్ లొ Digital Marketing కొరకు అవసరమయిన ముఖ్యమయిన విషయాలను మాత్రమె మీకు అందించదలుచుకున్నాను.

ఇవి కాకుండా మీకు ఏవైనా చిన్న చిన్న విషయాలు అవసరం అయితే మీరు క్రింద “Comment Box” లొ మీ ప్రశ్నలను పేర్కొంటే తప్పకుండా నాకు తెలిసినంతవరకు మీకు సహాయ పడగలను.

DIGITAL MARKETING-COURSE IN TELUGU లో మీరు ఇప్పుడు డిజిటల్ మార్కేటింగ్ ద్వారా ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు అనే విషయాన్ని చూడండి.




Digital Marketing Ways

  • Content Marketing
  • Affiliate Marketing
  • Local Marketing
  • Social media Marketing
  • Blogging
  • Mobile Marketing
  • Email Marketing

DIGITAL MARKETING-COURSE IN TELUGU CONTENT MARKETING:

DIGITAL MARKETING-COURSE IN TELUGU - CONTENT MARKETING

Content Marketing అనగా ఒక ఉత్పత్తి గురించి ప్రకటించడం కొరకు కంటెంట్‌ను సృష్టించి దానిని మీ వెబ్ సైట్ లో పొందుపరచి తద్వారా ఆయా ఉత్పత్తులకు వినియోగదారులను తీసుకుని రావడం.

అంటే మీరు అమ్మకం దార్లకు మరియు వినియోగదారులకు మధ్యవర్తిగా ఉండి మీ వెబ్ సైట్ ద్వారా సరియైన సమాచారాన్ని అందించగలగడం. ఇలా చేయడం ద్వారా మీరు అమ్మకందార్ల నుండి రుసుం రూపంలో మీరు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.

ఈ రుసుం నెలకు వందల్లో మొదలు కొని లక్షల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది.

DIGITAL MARKETING-COURSE IN TELUGU AFFILIATE MARKETING:

Digital-Marketing-Course-in-Teglugu-affiliate-marketing

DIGITAL MARKETING-COURSE IN TELUGU లో ఈ విభాగము అతి ముఖ్యమయినది.

Affiliate Marketing (అనుబంధ మార్కెటింగ్)  ద్వారా ఒక కంపెనీకి చెందిన వస్తువులను మీరు సిఫార్సు చేసి వారి వస్తువులను అమ్మడం అన్న మాట. 

ఇందులో మీరు చేసే రికమండేషన్ ఆధారంగా వినియోగదారులు వస్తువులు కొనడం జరుగుతుంది.

కావున మీకు సదరు వస్తువుల గురించి పూర్తీ అవగాహన కలిగి ఉండాలి.

మీరు ఆ వస్తువుల గురించి ఎంత బాగా రికమండ్ చేస్తే అంత ఎక్కువగా అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుంది.

మీ వెబ్ సైట్ లో మీరు రికమండ్ చేసే కంపెని యొక్క లింక్‌ను ఉపయోగించి ఒక వినియోగదారుడు ఆ కంపెని యొక్క వస్తువుని కొన్నప్పుడు, మీరు దాని నుండి కమీషన్ పొందుతారు.

Affiliate Marketing ద్వారా ఎందరో మంది ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.




DIGITAL MARKETING-COURSE IN TELUGU – LOCAL MARKETING:

DIGITAL MARKETING-COURSE IN TELUGU - LOCAL MARKETING

DIGITAL MARKETING-COURSE IN TELUGU లో చాలా సునాయసమయిన విధానం ఇది.

మనం నివసిస్తున్న ఏరియాలలో చేసే మార్కెటింగ్ నే Local Marketing అంటారు. Local Marketing ద్వారా మీ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు చెందిన వస్తువులను కాని లేదా మీ ఏరియా లో ఉండే వివిధ దుకాణాలను సిఫార్సు మీ వెబ్ సైట్ ద్వారా సిఫార్సు చేస్తూ వారి వస్తువులను అమ్మడంలో సహకారం అందించవచ్చు.

కేవలం వస్తువులనే సిఫార్సు చేయడమే కాకుండా, మీ ఏరియాలో ఉన్న Schools, Colleges, Hospitals, Used Vehicles, Real Estate, Astrology, Matrimony తదితర ఫీల్డ్ లలో advertisement చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.

నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా Local Marketing ద్వారా చాల సునాయాసంగా డబ్బులు సంపాదిస్తున్నాను. అది ఎలాగంటే……

మొదలు ఒక ఉచిత వెబ్ సైట్ ని (బ్లాగ్ స్పాట్) adilabadcontacts.blogspot.com క్రియేట్ చేసాను.

తరువాత  ఆదిలాబాద్ పట్టణములో నివసించే కొందరు వ్యక్తుల యొక్క Contacts మరియు దుకాణాల యొక్క Contactsని సేకరించి ఆ వెబ్ సైట్ లో పొందుపరిచాను.

ఆ తరువాత కొందరు యువకులను ఎంగేజ్ చేసుకుని వారు తెచ్చిన ఆర్డర్ లో వారికి తగిన రీతిలో కమీషన్ ఇస్తూ వారి ద్వార ఆదిలాబాద్ లో గల దుకాణముదార్లకు నా వెబ్ సైట్ గురించి వివరించి అందులో advertisements సేకరించడం జరిగింది.

ఈ advertisements కి సంవత్సరానికి ఒక రేట్ ఫిక్స్ చేసి వీరి వద్ద నుండి ప్రతి సంవత్సరం నేను రుసుము సేకరించడం జరుగుతుంది.

adilabadcontacts.blogspot.com వెబ్ సైట్ ని ఒకసారి మీరు చుస్తే మీకు నేను ఎంత సులువుగా డబ్బులు సంపాదిస్తున్నానో అర్థమవుతుంది.  కేవలం కొన్ని రోజులు మాత్రమె శ్రమ పడి నిరంతరంగా డబ్బులు సంపాదించడం గమనించవచ్చు.




DIGITAL MARKETING-COURSE IN TELUGU  SOCIAL MEDIA MARKETING:

DIGITAL MARKETING-COURSE IN TELUGU -  SOCIAL MEDIA MARKETING

DIGITAL MARKETING-COURSE IN TELUGUలో ఎవరయిన మార్కెటింగ్ చేయగలిగిన విభాగం Social Media Marketing.

మీ విక్షకులతో మీకు సంభందం పెంపొందించడానికి సోషల్ మీడియా ఒక గొప్ప వేదిక.

సోషల్ మీడియా ద్వార మీ పోటీదారులు ఎవరో మీకు తెలుస్తుంది.

సోషల్ మీడియాలో మీ కస్టమర్‌లు ఎవరితో సంభాషిస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకునవచ్చు.

మీ వ్యాపారానికి సంబంధించినటువంటి సమాచారం, ఎవరు పోస్ట్ చేస్తున్నారు లేదా పంచుకుంటున్నారు అనే విషయాన్ని  కూడా మీరు తెలుసుకునవచ్చు. 

Facebook, Twitter, Whatsapp, Instagram లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా Digital Marketing ని చాల చక్కగా  చేయవచ్చు.

ఈ రోజుల్లో ప్రజలు వారి ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో గడపడం మీరు చూసే ఉంటారు. వీరి ఈ అలవాటుని మీరు Digital Marketing కొరకు చాల చక్కగా వినియోగించుకునవచ్చు.

ఫేస్బుక్ గ్రూప్ లలో  చురుకుగా పాల్గొనండి. మీ వ్యాపారానికి సంభందం కల గ్రూప్ లలో జాయిన్ అవ్వండి.

మీరు ఫేస్బుక్ గ్రూప్ లో భాగమైతే, మీ పోటీదారులను కనుగొనడానికి అక్కడ జరిగే సంభాషణలను మీరు ఉపయోగించుకోవచ్చు.

ఉదాహరణకి మీరు మీ Face Book లో ఒక product గురించి వివరించి, దానికి సంభందించిన ఒక ఇమేజ్ ని పోస్ట్ చేసి దానికి ఒక అఫిలియేట్ లింక్ ని పేస్ట్ చేసారనుకొండి.

సహజంగా మీ Facebook Account లో పోస్ట్ చేసిన Advertisementని మీ స్నేహితులందరు గమనించి మీరు పేస్ట్ చేసిన లింక్ ద్వారా ఆ ప్రాడక్ట్ ని ఖరీదు చేసే అవకాశం ఉంది.

అంతే కాక Face book లాంటి Social Media లో అందుబాటులో ఉన్న గ్రూప్ లలో ఈ లింక్స్ ని పేస్ట్ చేయడం ద్వారా మీకు తెలియని వ్యక్తుల ద్వారా కూడ మీ Digital Marketing పెరిగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మీరు పాల్గొనే ఫేస్‌బుక్ గ్రూప్ లను వ్యక్తిగత ఉపయోగం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.

అవి మీ వ్యాపారానికి సంబంధించినవి కాకపోవచ్చు, కానీ అవి స్థానికంగా ఉంటే, మీ పోటీదారులను కనుగొనడానికి అవి మీకు సహాయపడతాయి.




DIGITAL MARKETING-COURSE IN TELUGU – BLOGGING:

ఒక బ్లాగర్ (బ్లాగ్ క్రియేట్ చేసే వ్యక్తి) ఏదైనా ఒక అంశంపై తన వ్యక్తిగత అభిప్రాయం ఒక బ్లాగ్ ద్వార తెలుపడాన్ని బ్లాగింగ్  (Blogging) అంటారు. 

ఈ బ్లాగ్ లను మీరు ఏ భాషలో నైనా రాయవచ్చు.

మీకు మంచి అవగాహన మరియు పట్టు ఉన్న అంశంపై ఒక బ్లాగ్ ని క్రియేట్ చేసి, దానిని చక్కని ఇమేజ్ లతో Search Engine Optimisation చేసి సెర్చ్ ఇంజన్ లలొ మంచి ర్యాంకింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. 

తరువాత మీరు గూగుల్ యాడ్‌సెన్స్‌ను వారికి మీ బ్లాగ్ లో Google Adsense ప్రకటనలు ప్రచురించడానికై పెర్మిషన్ కొరకు అప్లై చేసుకోవాలి. 

అయితే ప్రస్తుతం Google Adsense వాళ్ళు ఒక బ్లాగ్ లో దాదాపు 20 Articles వరకు ఉంటేనే Google Adsense అప్రూవ్ చేస్తున్నారు.

మీ బ్లాగ్ కి ఒకసారి Google Adsense అప్రూవల్ దొరికిందంటే చాలు. తరువాత Google Adsense వారు ఆటొమెటిక్ గా అమర్చే Google Adsense ప్రకటనలను ఎవరు క్లిక్ చేసినా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. 

ఈ విధంగా మీ బ్లాగులో ఒక నిజమైన కంటెంట్‌తో పాఠకుడిని ఆకర్షించవచ్చు.

అంతే కాకుండా కామెంట్స్ రూపంలో వారు ఇచ్చే email చిరునామాకు ఉచితంగా మీ బ్లాగ్ కి సంభందించిన Articles పంపడం ద్వారా మీ వెబ్ సైట్ విక్షకుల నమ్మకాన్ని పెంచుకోవచ్చు మరియు మీ బ్లాగులో ఏదేని ఉత్పత్తి యొక్క ప్రచారం చేయవచ్చు, ఇది పాఠకులకు నిజంగా ఉపయోగపడుతుంది. 




MOBILE MARKETING:

మొబైల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ యొక్క వినూత్న మార్గం.

ఇది ఈ మధ్య కాలంలో అత్యధిక ప్రాచుర్యాన్ని పొందుతుంది.

దీని ద్వారా మొబైల్ ఉపయోగించే జ్ఞానం కలిగిన ఏ వ్యక్తులయిన డిజిటల్ మార్కెటింగ్‌తో ఆన్‌లైన్ లో డబ్బు సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Work from Home ద్వారా  Mobile Marketing చేసి House wives కూడా డబ్బు సంఫాదించడం మొదలయింది.

Mobiles ని ఉపయోగించి అతి సులువుగా Social Mediaలో మార్కెటింగ్ చేయవచ్చు.




eMAIL MARKETING :

ఇమెయిల్ మార్కెటింగ్ అనేది మార్కెటింగ్ యొక్క వినూత్న మార్గం. అయితే దీనిలో ఉన్న చిక్కు మన వినియోగదారుల eMail Address లను మనం సంపాదించడాం.

ఒక సారి ఒక వ్యక్తి యొక్క పర్మీషన్ తో కూడిన eMail address మీరు పోందగలిగితే తరువాత eMail ద్వారా మీకు గల Affiliate Account link లను వారికి పంపడం ద్వారా మీరు డబ్బు సంపాదించ వచ్చు.

ఈ eMail మార్కెటింగ్ లో ఉన్న సౌకర్యం ఏంటంటే కేవలం ఒకే క్లిక్‌ ద్వార మీ లిస్ట్ లో ఉన్న అందరు కస్టమర్లకు పంపవచ్చు.

మీరు పంపే eMail లో కంటెంట్ రాయవచ్చు మరియు లింక్‌లతో కూడిన గ్రాఫిక్ కంటెంట్ ని కూడా పంపవచ్చు. ఇది కస్టమర్‌కు సులభంగా కొనుగోలు చేయడానికి సహాయ పడుతుంది.

కస్టమర్ యొక్క Reactionను మరియు ఉత్పత్తి యొక్క మార్కెటింగ్ ను అంచనా వేయడానికి ఇది సులభమైన మార్గం.




MARKETING WITH WEB-DESIGNING:

DIGITAL MARKETING-COURSE IN TELUGU లో అతి ముఖ్యమయిన విభాగం Web Designing Marketing.

వెబ్ సైట్  క్రియేట్ చేయడం ద్వారా కూడ ఆదాయం వస్తుంది. ఒక వేళ మీకు Website క్రియేట్ చేయడం పైన సరియయిన అవగాహన లేకుంటే, ఎటువంటీ కోడింగ్ కాని వేరె ఇతర ఎటువంటి కోర్సులు చేయకుండా చాలా సునాయసంగా వెబ్ సైట్ ని క్రియేట్ చేయడం తెలుసుకునడానికి క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

Search Engine Optimisation (SEO)

డిజిటల్ మార్కెటింగ్ లో అతి ముఖ్యమయినది Search Engine Optimisation (SEO).

మీ వెబ్‌సైట్ Search Engineలలో మొదటి ర్యాంకింగ్ లలో రావాలంటే మీ వెబ్ సైట్ కి కంటెంట్ చాలా ముఖ్యమైనది.

కంటెంట్ లో ముఖ్యంగా మీరు మీ కంటెంట్ యొక్క హెడ్ లైన్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

అంతే కాకుండా హెడ్ లైన్ తరువాత మీరు రాసే మొదటి వాక్యాల(slug) పైన కూడా దృష్టి పెట్టండి.

ఎందుకంటే ఇది సెర్చ్ ఇంజన్ ఫలితాలను నడిపిస్తుంది, మీ పేజీకి ట్రాఫిక్‌ను పెంచుతుంది.

సెర్చ్ ఇంజన్ లో మీ  వెబ్ సైట్ కి ఉన్న హెడ్ లైన్ మరియు మొదటి వాక్యాలను చూసి మాత్రమె ఒక వీక్షకుడు మీ వెబ్ సైట్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది.

అంటే కేవలం రెండు సెకనుల నుండి నాలుగు సెకనుల మధ్య కాలంలో ఆ వ్యక్తీ మీ వెబ్ యొక్క మొదటి వాక్యాలను (slug) చూసి మీ వెబ్ సైట్ ఓపెన్ చేయాలా లేదా అని డిసైడ్ చేసుకుంటాడు.

ఈ సమయంలో మీ వెబ్ సైట్ యొక్క హెడ్ లైన్ మరియు స్లగ్ ఆ వ్యక్తిని ఆకర్షించే విధంగా ఉండాలి.

హెడ్ లైన్ ఆసక్తిని రేకెత్తించకపోతే లేదా ఉద్వేగాన్ని రేకెత్తించకపోతే మీరు మీ కంటెంట్‌తో ఆశించిన ఫలితాలను సాధించలేరు.   

ఒకసారి వీక్షకుడు మీ వెబ్ సైట్ కి వచ్చిన తరువాత మాత్రమే మీరు అందించిన “కంటెంట్” పైన ద్రుష్టి పెడతాడు.

ఈ కంటేంట్ మాత్రమే కాకుండా క్రింద పేర్కొనబడిన ఇతర విషయాలు Search Engine Optimisation కొరకు ఉపయోగ పడతాయి.

  • కంటెంట్,
  • కీవర్డ్స్,
  • ఇతర వెబ్ సైట్ లకి లింక్స్ ఇవ్వడం,
  • మీ అతర్గత వెబ్ సైట్ లకి లింక్స్ ఇవ్వడం,
  • ఇమేజ్ ల అవసరం,
  • కీ ఫ్రేసేస్ ఎలా ఉండాలి
  • Search Engine Optimisation (SEO) చేయడానికి ఉపయోగ పడే WordPress Yoast SEO Plugin

ఈ విషయాల గురించి సవివరంగా నేను ఇతర బ్లాగ్ లో రాయడం జరిగింది. క్రింది లింక్ ని క్లిక్ చేసి మీరు మీ వెబ్ సైట్ నకు Search Engine Optimisation (SEO) ఎలా చేయాలో తెలుసుకోండి.

పైన పేర్కొన్న విషయాలు కాకుండా Digital Marketing చేయడానికి అవసరమయిన కొన్ని చిట్కాలను నేను  క్రింద పేర్కొంటున్నాను.

వీక్షకుల నమ్మకాన్ని సంపాదించాలి.

ఒకరి నమ్మకాన్ని పొందడం, తద్వారా దాని ద్వారా వ్యాపారం విస్తరింపచేయడానికి  మామూలుగా ట్రెడిషనల్ మార్కెట్ లో అయితే వినియోగదారుల మాట విన్న తరువాత వారి మాటలను మీరు అర్థం చేసుకున్నారని వినియోగదారులకు నమ్మకం కలిగించ వచ్చు.

కాని “Digital Marketing” లో వీక్షకులను మీరు డైరెక్ట్ గా కలిసే అవకాశం లేనందున, మీరే ఒక వినియోగాదరువైతే మీకు ఎటువంటి అవసరాలు ఉంటాయో అంచనా వేయగలగాలి.

అంతే కాకుండా వినియోగదారులకు అవసరాలను  సులభంగా మరియు సమర్థవంతంగా పరిష్కరించడానికి మీ వద్ద సరైన సాధనాలు ఉన్నాయని తెలియజేయాలి.

వీక్షకులకు అర్థమయ్యేలా చాల సులభమయిన మరియు  సరళమైన భాషలో కంటెంట్ రాయాల్సి ఉంటుంది.

Digital Marketing లో కూడా చాల పోటీదారులు ఉంటారు. అయితే వారికి మీకు కల తేడాలను వీక్షకులు గమనించేలా మరియు మీ వెబ్ సైట్ ని అనుసరించడం ద్వారా వీక్షకులకు ఎటువంటి లాభాలు కలుగుతాయో మీ వెబ్ సైట్ లో మీరు చూయించ గలగాలి.

మీరు వ్రాసే కంటెంట్ లో ప్రతి ప్యారగ్రాఫ్ నకు కేవలం ఒకటి నుండి మూడు లైన్ లు ఉండేటట్లు చూడండి. 

దీని ద్వారా మీ వీక్షకులకు మీ వెబ్ సైట్‌లో వారికి అవసరం లేని  సమాచారాన్ని దాటవేయడం మరియు వారికి అవసరమైన వాటిని కనుగొనడం చాలా సులభంగా ఉంటుంది.

మీ వీక్షకులను లక్ష్యంగా చేసుకోవాలి:

మీ వెబ్ సైట్ కి వచ్చే వినియోగదారుడు ఎవరో మీకు తెలియదు. వారికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలియదుగానీ వారికి సరైన సమాచారం అందించాలి. అందుకే మీ వీక్షకులకు అవసరమయిన విషయాల పై దృష్టి పెట్టాలి మరియు వారి అవసరాలపై పరిశోధన చేయాలి.

“మీకు తెలియని వ్యక్తిలకి, మీరు ఎదురుగా లేని వ్యక్తిలకి, వారికి అవసరమయిన వస్తువుని మీరు అందచేయాలి”

ఇది చాల ఆసక్తి కలిగించే ప్రక్రియ. ఇందులో మీరు ప్రావీణ్యం  పొందిన కొలది ఈ సబ్జెక్ట్ పైన ఇంటరెస్ట్ పెరగడం జరుగుతుంది.

ఈ ప్రక్రియ లో ప్రావీణ్యం పొందడం ఎలా?

మొదట, మీ వీక్షకులలో ఎవరు ఉంటారో గుర్తించండి. వారి వయస్సు, వైవాహిక స్థితి, వృత్తి మరియు ఇతర ప్రాథమిక సమాచారం మీ ప్రేక్షకులను మిగిలిన ఇంటర్నెట్ నుండి క్రమబద్ధీకరించడానికి మీకు సహాయపడుతుంది.

మీ వీక్షకులను గుర్తించడానికి ఫోరమ్‌లు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లు చాల సహాయ పడుతాయి. ఫోరమ్‌లు లేదా సోషల్ మీడియాలలో వివిధ రకములైన వీక్షకుల యొక్క ఆసక్తులు తదితర విషయాలను తెలుసుకున వచ్చు.

మీరు ఎటువంటి వస్తువులను మార్కెట్ చేయాలనుకుంటున్నారో, వాటికి సంభందించిన షాప్స్ లో మీరు స్వయంగా వెళ్ళి ఆ వస్తువుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి.

మరియు ఈ వస్తువుల గురించి ఏవయిన సమావేశాలు గాని ఎక్జిబిషన్స్ గాని ఉంటే వాటికి హాజరవ్వండి.

ఒక వినియోగదారుని వలె ఆ వస్తువుల గురించి మొత్తం తెలుసుకోనండి. మీరు తెల్సుకున్న విషయాలనే మీ కంటెంట్ లో వీక్షకులకు అర్థమయ్యే విధంగా రాయండి.

ముగింపు:

మీ వెబ్ సైట్ ద్వారా మీరు Digital Marketing చేస్తున్నప్పుడు మీరు గుర్తు పెట్టుకొనవలసిన విషయం – “మీరు కొంత సమాచారం కోరుకునే మనస్సు గల వ్యక్తులతో మాట్లాడుతున్నారు” అని.

ఈ వ్యక్తుల యొక్క నమ్మకము మీరు పొందినప్పుడే మీరు Digital Marketing లో సక్సెస్ అయినట్టు.

ఎప్పుడయితే మీ వీక్షకులకు అవసరమైన సమాచారాన్ని మీరు వారికి స్పష్టతతో అందించ గలుగుతారో అప్పుడే వారి నమ్మకాన్ని పొందుతారు.

ఒకసారి మీ వీక్షకుల యొక్క నమ్మకాన్ని పొందిన తరువాత వారు ఎప్పటికి మిమ్మల్ని విడిచి వెళ్ళక పోవచ్చు.

ఎప్పుడయితే మీరు Digital Marketing Course ని పూర్తిగా నేర్చుకుంటారో, అప్పుడు మీరు ఆన్ లైన్ లో Digital Marketing ద్వారా రక రకాలుగా డబ్బు సంపాదించవచ్చు.

మీరు ఒక Digital Marketing Job చేయవచ్చు.

ఒక Digital Marketing Agency కాని ఒక Digital Marketing Company ని కాని ప్రారంబించవచ్చు.

లేదా ఒక Freelancer in Digital Marketing లా వివిధ కంపెనీలకు Digital Marketing Services అందచేయవచ్చు. 

అంతే కాదు వివిధ Topic ల మీద Books రాసి కాని Video లు తీసి కాని Digital Marketing ద్వార Online లో అమ్మకాలు జరిపి డబ్బు సంపాదించవచ్చు.

DIGITAL MARKETING-COURSE IN TELUGU అనే ఈ బ్లాగ్ లో మీరు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? మరియు డిజిటల్ మార్కెటింగ్ చేయడం ద్వారా ఆన్ లైన్ లో డబ్బు సంపాదించడం ఎలా? అనే విషయాలను పూర్తిగా తెలుసుకున్నారనుకుంటున్నాను.




8 thoughts on “DIGITAL MARKETING COURSE IN TELUGU”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Get 30% off your first purchase

X